మీరేమంటారు ?

భారత రాజ్యాగంలో పౌరులందరికి కొన్ని హక్కులున్నవి. చట్టం ముందు అందరూ సమానులే. ఒకరికి ఒక న్యాయము, మరొకరికి మరొక న్యాయము ఉండదు. దళితులపై అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఒక దళితేతరుడు, ఒక దళితుడిని గాని, గిరిజనుడిని కాని బహిరంగంగా అవమానిస్తే అది శిక్చార్హమవుతుంది. అదే ఒక దళత లేదా గిరిజన వ్యక్తి దళితేతరవ్యక్తిని అవమానిస్తే అసాధారణ చట్టాలేవి ఆ వ్యక్తికి అందుబాటులో లేవు.

భారత దేశంలో ఒక పౌరుడు, అన్యాయం జరిగింది అని అనుకున్నప్పుడు ఒక "దిష్టిబొమ్మ" ని పేరిడి, కొట్టి, కాల్చీ తన ఆవేదనని, ఆగ్రహాన్ని, నిరసనని తెలియజేస్తుంటాడు.

మొన్న గిరిజనస్త్రీలపై సాముహిక అత్యాచారం జరిగింది.మరి ఈ ప్రభుత్వం ఆ దోషులను ఎందుకని ఈ అత్యాచారనిరోధక చట్టం క్రింద శిక్షించడానికి ప్రయత్నించలేదు?
* * *
పత్రికలు ప్రజలను జాగృతంచెయ్యాలి. చైత్యనవంతులని చెయ్యడంవాటి విద్యుక్తధర్మాలలో ఒకటి. అందుకనే ఇందిరా గాంధి పాలనలో ఎమర్జెన్సి ని విధించి పౌరస్వేచ్చ, పత్రికా స్వేచ్చని నియంత్రిచినప్పుడు, ప్రజాభిప్రాయాన్ని మన్నించిందీ ఈ పత్రికలే! ప్రజలను చైతన్యవంతులని చేసింది ఈ పత్రికలే! ఆ నాటి "కబంధ హస్తాల" పాలన నుండి రక్షించింది ఈ పత్రికలే! కాబట్టి పత్రికా స్వేచ్హకి ఏ మాత్రం భంగం కలిగినా తీవ్రంగా ప్రతిఘటించాలి.

* * *
ఆంధ్రజ్యోతి పత్రిక "బాడుగనేతలు", మే ౨౪న వెలువడ్డప్పుడు, కొంతమంది నేతలకు బాధ కలిగింది. తమ ఆత్మగౌరవాన్ని ఆ పత్రిక అవమాన పరిచిందని భావించారు. ఒక నేతను అవమానిస్తే, ఆ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గాన్ని కూడా అవమానించినట్టే అని భావించి, కొందరు తమ నిరసనని, రాష్ట్ర రాజధాని హైదబాదులోని అంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి, కాల్చివెయ్యడానికి ప్రయత్నించారు. విధ్వంసం సృష్టించారు. ఆ క్రమంలో ఒక ఉద్యోగిని తన ప్రాణాలతో తన సహోద్యుగుల సహాయంతో తప్పించుకో గలిగింది. ఇతర ప్రాంతలలోని, ఆ నేతల అనూనయులు లేదా వారి అనుచరులు కొందరు, కొన్ని దిష్టిబొమ్మలు తయారుచేసి వాటికి, ఆంధ్రజ్యోతి - "రాధాకృష్ణ", సంపాదకుడు శ్రీనివాస్ పేర్లు తగిలించి, చెప్పులతో కొట్టి వాటిని దహించి తమ నిరసనని, ఆ నేతమీద తమకున్న అభిమానాన్ని తెలియజేసుకున్నారు.

ఏ దళితుల ఉద్యమాని తాము ప్రోత్సహించారో, అదే వర్గానికి చెందిన నాయకుడు ఒక పధకం ప్రకారం, తన సిబ్బందిమీద, తన కార్యాలయాల మీద దాడి చెయ్యడానిని గర్హిస్తూ ఆంధ్రజ్యోతి సిబ్బందిలోని కొంతమంది, ఒక "దిష్టిబొమ్మ" ని తయారుచేసి దానిని "దూషించి, అవమానించారు, కాల్చారు."

దళితులమీద అత్యాచార నిరోధక చట్టం క్రింద అది నేరం అంటూ ఆ సంపాదకుడిని, ఆంధ్రజ్యోతి ఎమ్. డి రాధాకృష్ణ , విలేకరులు వంశికృష్ణ, శ్రీనివాస్ ని గూడా అరెస్టు చెయ్యాలని, లేని పక్షంలో తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. నాటకీయంగా, రాత్రిపూట హుటాహుటిన ప్రభుత్వం సంపాదకుడు శ్రీనివాస్‌, విలేకరులు వంశీకృష్ణని,శ్రీనివాస్‌ని అరెస్ట్ చేసింది.

చట్టం ముందు అందరు ఒక్కటి కాదు అన్నది ఇక్కడ నిరూపితమయ్యింది.

* * *
వై.ఎస్. రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు లాగానే, దళితులు ఆత్మగౌరవంతో జీవించడానికి, కులంపేరు అడ్డంకి కారాదు అంటూ, తన "మాదిగ" కులాన్ని సూచించే పదాన్ని పేరులోనే ఇముడ్చుకుని మంద కృష్ణ మాదిగ గా ఎదుగుతు, బడుగు, అణగారిన వర్గాలకు నేతృత్వం వహిస్తు ఒక సామాజిక ఉద్యమకారుడిగా మారాడు.

మరి పేరులోనే తన కులాన్ని ఇముడ్చుకున్న కృష్ణ మాదిగ, తన కులం పేరుతో తనని ఒక బహిరంగ ప్రదేశంలో దూషించి అవమానించారనడం విడ్డూరం.

* * *
ఇక ఈ సభ్య సమాజంలో దిష్టిబొమ్మలను తగలేసి నిరసనను తెలియజేసుకోలేని పరిస్థితులలో, వ్యక్తుల ప్రాణాలు తీసి, ఆస్తులను విధ్వంసంచేసి, ఒక ఆటవిక న్యాయానికి పోరుబాటను చూపిస్తూ మార్గాన్ని సుగమం చెయ్యాలా?

* * *
ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి కి మంద కృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్య తదితరులకి అవినాభావ సంబంధాలున్నవన్న ఆరోపణల నేపధ్యంలో స్వచ్చమైన, మచ్చలేని మేలు జాతి వజ్రం లాంటి వ్యక్తిత్వమున్నవారు ప్రవర్తించే తీరేనా ఇది?

నిజంగానే ఈ నేతలు, ఉద్యమకారులు, అటువంటివారైతే, ఈ అగ్రకుల రాజకీయవేత్తలు తమ రాజకీయ చదరంగంలో వీరిని పావులుగా వాడుకుంటున్నారా?

ఒక వేళ అదే నిజమైతే, వీరి ఉద్యమం గతేమిటి?

ఈ రాష్ట్ర ప్రజల భవితేమిటి?పూర్తిగా చదవండి ...

ఏం చేస్తారండి?

నెటిజన్‌ని అభిమానించే వారనండి, శ్రేయోభిలషులనండి, వారిని బహుశ ఒక చేతి వేలి మ్రీద లెఖబెట్టవచ్చు.
జాగ్రత్తగా ఉండమంటున్నారు.

ఏం చేస్తారండి?
మెడ మీద తల తీస్తారా?
కాళ్ళూ చేతులు విరక్కొడతారా?
జీవచ్చవంలాగ మిగిలిన జీవితాన్ని, ఏ మంచం మీదో గడిపేలాగా చేస్తారా?
ఏం చేస్తారండి?
దేనికి వెరిచేదిలేదు.పూర్తిగా చదవండి ...

కులాలకురుక్షేత్రం - శాంతి భద్రతల సమస్య?

గమనించారా!
దీన్ని ఎటు వైపు మళ్ళిస్తున్నారో?
మళ్ళీ మరో కులాలకురుక్షేత్రం మొదలైనా ఆశ్చర్యం లేదు.
మనం జాగరూకతతో ఉండాలి!
దానికి తావివ్వకూడదు.
సంయమనం పాటించాలి.
విచక్షణను కోల్పోరాదు.
ఇది నేటి ఆంధ్రజ్యోతిలో, రెండవ పేజీలో -
పూర్తిగా చదవండి ...

ఆంధ్రజ్యోతి సంపాదకుడు, శ్రీనివాస్ - దళిత వ్యాసాలు

బడుగు జీవుల, అణగారిన ప్రజల నేత మంద కృష్ణ మాదిగ దిష్టిబొమ్మని చెప్పులతో కొట్టినవాడుగా ఆరోపించబడి, రెండు వారాలు రిమాండు అరెస్టుతో చంచల్‌గూడా కారాగారంలో సమయాన్ని గడుపుతున్న ఆంధ్రజ్యోతి సంపాదకుడు, శ్రీనివాస్, ఆ అణగారిన, దళితుల కోసం తన కలంతో ఎలా పాటుబడ్డాడో, మరొక దళితుడి మాటల్లో ఇక్కడ చదవండి.

ఇది బుధవారం,25 జూన న వెలువడిన ఆంధ్రజ్యోతి దినపత్రికలోని తొమ్మిదవపేజిలోని వ్యాసం.
వ్యాసకర్త: ఘంటా చక్రపాణి, సామాజిక పరిశోధకుడుపూర్తిగా చదవండి ...

వాళ్ళందరికి బెయిల్ దొరికిందండోయి!

బ్లాగులకి పత్రికలు కావాలి!
బ్లాగుల గురించి పత్రికలు రాయాలి!
అందులో పేరు చూసుకుని సంతోషించాలి!
కాని ఆ పత్రికల స్వేచ్హ మీద దాడి జరిగినప్పుడు, ఈ బ్లాగ్ ప్రపంచంలో ఎంత మంది తమ సంఘీభావాన్ని తెలిపారన్నది ఆలోచించాల్సిన విషయం!
మీకు తోచింది చెయ్యండి!


వీళ్ళందరికి బెయిల్ దొరికిందండోయి!
ఈయనే ఆంధ్రజ్యోతి సంపాదకుడు - శ్రీనివాస్.పూర్తిగా చదవండి ...

మంద కృష్ణ మాదిగ మందస్వామ్యం

ఆంధ్రజ్యోతి మీద మళ్ళీ దాడి జేస్తారంట!
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు కానివ్వండి, ఆంధ్రజ్యోతి "బాడుగనేతలు" అని పేరిడిన నేతల సంస్థల సభ్యులు కానివ్వండి, వారు కూడ, ఈ సమాజంలో సభ్యులే కదా?
మరి వారికి, ఈ న్యాయ సభలు, చట్టాలు పనికి రావా?
అన్యాయం జరిగినప్పుడు వారు వాటిని అశ్రయించరా?
వారికి నీతి లేదా?
వారి నీతి వేరా?
వారి ధర్మాలు వేరా?
వివాదాలని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే అవకాశం లేదా?
సంయమనం పాటించరా?
ఆటవిక న్యాయంతో పాశవీక చర్యలకు పాల్పడి, తమకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడమే వారికి తెలుసా?
ఇదేనా వీరి న్యాయం?
ఇదేనా వీరి ధర్మం?
మరి ఈ చట్టలేందుకు, న్యాయ వ్యవస్థలెందుకు?
ఈ రక్షణ దళాలెందుకు?
నేతలు ప్రవర్తించే తీరు ఇదేనా?
ఇది ప్రజాస్య్వామనిపించుకోదు.
ఇది మంద స్వామ్యం!

ఇది నేటి ఈనాడు లోని వార్త!పూర్తిగా చదవండి ...

వగలాడి అంజలి ఒక 420

మన పోలిసోళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, అందరికి చెబుతారు కదా, ఇక్కడ ఇలాంటి ఘోరం జరిగింది, దానిని మేము ఇలా పరిష్కరించాము అని. ఆ పోలిసోళ్ళు చెప్పిందే ఈ విలేకరులు వ్రాసుకుంటారు. ఆ టీ వీ వాళ్ళు చూపిస్తారు. అలాంటి ఒకానొక పత్రిక - ఈనాడు లో (అంజలి 420 కధ జూన్ 10న హైద్రాబాద్ ఎడిషన్ పేజి 5లో )విలేకరి వ్రాసింది - ఈనాడులో ఇక్కడ చదవండి.
అంజలి కధ బ్లాగరి మాటల్లో ఈ క్రింద చదవండి.
ఇది అంజలి కధ.

అంజలి ఒక 420.
అంజలి ఒక నెరజాణ.
వగలాడి.
ఒక మోసగత్తె.
ఒక టక్కులాడి.
వగలు పోతు తన అందంతో మగవాడిని ఉచ్చులోకి లాగి వాడి జేబులో డబ్బు, మెడలో బంగారపు గొలుసులు లాఘవంగా లాగేస్తుంది. వాడు తాగి విజృంభిస్తానంటే అలాగే అంటుంది తనలో తాను నవ్వుకుంటూ. తెలిదుగా ఆ అమాయకుడికి. వాడు నువ్వుకూడా తాగు అంటే కంపెని కోసం అంటూ తాగుతుంది. వాడితో తాగిస్తుంది. వాడు ఆ మత్తులో మునిగే దాక తాగిస్తుంది. తరువాత వాడివన్ని వొలుచుకుని తప్పుకుంటుంది. ఇలాంటి ఆడది దొరికితే ఏ మొగాడు చొంగ కార్చుకోకుండా ఉంటాడూ? పైగా వయసులో ఉన్న ఆడది. ఎర్రగా, పొంకంగా ఉన్న అంజలి పొందుకూడ ఎంత రంజుగా వుంటుందో ! వెమ్మట పడి తనతో రమ్మనకుండా ఉండగలడా? మనకి మన విలేకరి ఇంకోటి కూడా చెపుతున్నాడు - ఈ వగలాడి పెళ్ళి కూడా చేసుకుంది. మొగుడ్ని చంపేసింది కూడా.
ఇది అంజలి కధ - ఈనాడులో.
* * *

ఇది స్వాతి కధ

పెద్ద అడిసేపల్లి గ్రామంలోని రాములు కూతురు స్వాతి. స్వాతి కి ముగ్గురు చెళ్ళెళ్ళు. స్వాతి తల్లికి కూడా కష్టంగానే ఉండేది వీళ్ళని సాకడం. అందుకని రాములు, యాదమ్మ పిల్లలతో భాగ్యనగరం చేరుకున్నారు. సరూర్‌నగర్ ప్రాంతంలోని బస్తిలో కూలీలుగా జీవనం మొదలుబెట్టారు. ఆ దగ్గిరలోనే ఒక గుడికుడా ఉంది. స్వాతి గుడికి వెళ్ళేది.ఆ గుడిని శుభ్రం చెయ్యడం లాంటి చిన్ని చిన్ని పనులు చేస్తూ ఉండేది. స్వతహాగా కలుపుగోలు పిల్ల. అందరితోను కలిసిపోయింది.


రాములు ఒక గుత్తేదారు (కాంట్రక్టర్) దగ్గిర పనికి కుదిరాడు. అప్పుడప్పుడూ తనతో పనిలోకి తను పనిచేసే చోటుకు స్వాతిని కూడా తీసుకెల్లేవాడు. వయస్సులో ఉన్న పిల్ల. ఎర్రగా బుర్రగా ఉంది.మాములేగా! రాములు యజమాని కళ్ళు స్వాతి మీద పడ్డాయి. ఏదో ఒక మిష మీద స్వాతి కోసం బస్తి కి వచ్చేవాడు. ఫొనులు చేసి పిలిపించుకునేవాడు. బస్తిలో వాళ్ళందరు చెవులు కొరుక్కొవడం మొదలుపెట్టారు. స్వాతి శీలం మీద చర్చ మొదలయ్యింది.


శ్రీనివాస్, కృష్ణ, నగేష్, అనంద్‌కుమార్‌లు స్నేహితులు. ఆ రోజు శుక్రవారం. మార్చ్ 31. 2006. స్వాతిని వాళ్ళు కబుర్లలోకి దించారు. బలవంతంగా ఆటో ఎక్కించారు. కంచన్‌బాగ్‌కి తీసుకెళ్ళారు. అది ఇది చెప్పారు. మద్యం తాగించారు. వాళ్ళు తాగారు. ఒకళ్ళ తరువాత ఒకళ్ళు స్వాతిని చెరిచారు. దాఋణంగా, పాశవికంగా, రాక్చసంగా స్వాతి శీలాన్ని చిద్రం చేసారు. అప్పటిదాక కలివిడిగా, తలలో నాలుకగా ఉండే స్వాతి, నలుగురికి సహాయం చేసే స్వాతి, కృంగిపోయింది. ముడుచుకుపోయింది. ఈ ప్రపంచానికి దూరంగా తన ఒంటరిలోకంలోకి వెళ్ళిపోయింది. తన ప్రపంచంలో మగవాళ్ళమీద విపరీతమైన ద్వేషం పెంచుకుంది.


ఆ నలుగురు మీద ఫిర్యాదు చేస్తాను, తోడు రమ్మనమని అడిగింది. ఎవ్వరు తోడు రాలేదు. తనే ఒంటరిగా పోలిసు స్టేషన్‌కి వెళ్ళింది. వాళ్ళ మీద ఫిర్యాదు చేసింది. ఆ నలుగురు మెట్లు దిగి వచ్చారు. రాజీ అన్నారు. స్వాతి శీలానికి వెల కట్టారు. అక్షరాల అరవై వేల రూపాయలు. స్వాతికి ఇరుగు పొరుగు ప్రవర్తనలో స్పష్టమైన తేడా కనపడింది.


బస్తిలో ఒకసారి గొడవ జరిగింది. ఒక మహిళ మంగళ సూత్రం పోయింది. అందరి కళ్ళు స్వాతి మీదే.ప్రశ్నించడంలేదు అవి. స్వాతి ని రిమాండ్‌కి పంపారు. తల్లితండ్రులు దూరమయ్యారు. అదను దొరికింది. నేనున్నానుగా అంటూ రఘు దగ్గిరయ్యాడు. రసాన్ని అంతా తాగి పిప్పిని ఊసినట్టు ఉసేసాడు. ఒంటరి ఆడది. జైలుకెళ్ళినప్పుడైన ఖర్చులు. డబ్బు అప్పుతీసుకుంది. వాళ్ళందరు పీక్కు తినడం మొదలెట్టారు. త్రాగి మరిచిపోవడం మొదలుబెట్టింది. ఐస్‌క్రీంలు అమ్మే మస్తాను పెట్టిన ఐసుకి కరిగిపోయింది. మళ్ళీ మగవాడిని నమ్మింది. డబ్బులిచ్చాడు. ఒకరోజు రా పక్కలోకి అని అడిగాడు. రాను పొమ్మంది. చెయ్యిబట్టుకు లాగాడు. చీ, చెయ్యివదులు అంటు తోసింది. వాడు వెనకకి పడ్డాడు. స్వాతి మరో వైపుకి పడింది. మస్తాను తల పగిలింది. వాడికి నూకలు చెల్లాయి. స్వాతి తలకి బలమైన గాయం అయ్యింది. మతి తప్పింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ పోయింది. స్వాతి మతి స్థిరం పోయింది.

బ్రతకడానికి డబ్బులు కావాలి. అందుకని ఏ టి ఎం సెంటర్ల దగ్గిర మాటు వేస్తుంది. తను అసహ్యించుకునే మగవాడికి తన సెక్సీ నవ్వుతో ఆహ్వానం పలుకుతుంది. వాడికి తన మేని చాయతో ఎర వెస్తుంది. మాటల గారడితో బోల్తా కొట్టిస్తుంది. వాడి వెనక బైకు మీద కూర్చుంటుంది. వాడికి మత్తెకిస్తుంది. వాడి జేబులో చెయ్యిపెడుతుంది. డబ్బులు లాగేస్తుంది. వాడి కార్డులో డబ్బులుకూడా లాగేస్తుంది.

ముషిరాబాదులో ఒక ఏ టి ఎం దగ్గిర ఒకడు స్వాతి నవ్వులో పడి గిరికీలు కొట్టాడు. ఆనందంతో వంకీలు తిరిగిపొయ్యాడు. రా అన్నాడు. నవ్వుకుంది. సరే పద అంది. ఇంటికి వెల్దాం అన్నాడు. తీసుకెళ్ళమంది. వాడి బుర్రలో మందు, విందూ, పొందూ ఉంది. మందుకి కూడా "సై" అంది. ఇద్దరు తాగారు. తిన్నారు. వాడు పడుకున్నాడు. స్వాతి పడుకోలేదు. తనకి కావల్సినవి తీసుకుంది. వాడిని చూసి నవ్వుకుంది. చీకట్లోకి తప్పుకుంది. వాడికి మెళకువ వచ్చింది. లబో దిబో. పోలిసులున్నారుగా. పరుగెత్తుకెళ్ళాడు.

వాళ్ళు వల విసిరారు.
లేడి వాళ్ళకి చిక్కింది.
ఎర్రగా బుర్రగా ఉంది.
పత్రికల వాళ్ళని పిల్చారు.
స్వాతిని చూపించారు.
వాళ్లు వ్రాసుకున్నారు.
టీ వీ వాళ్ళని పిలిచారు.
వాళ్ళు వచ్చారు.
స్వాతిని చూపించారు.
ఒంటరి ఆడది.
చీ, ఇది ఆడదేనా అని అన్నారు?
ఆ అన్నది ఆడ ఆంకర్‌లే!


ఇప్పుడు చెప్పండి, ఎవరి కధనం బాగుంది?

ఈనాడు దా? సాక్షిదా?సాక్షి లోని ఈ కుర్రాడెవడో స్వంత బుద్ధిని ఉపయోగించి ఆ అమ్మాయి వెమ్మట బడి కొంత వివరాలు తెలుసుకున్నాడు.

ఆంగ్లంలో అంటారు - "a girl with a good geography has always a history" అని. అందుకే తన వార్త(?) కి "అందమే నా నేరమా?" అని శీర్షిక పెట్టాడు. అతనికి అంత ఆంగ్ల భాష పరిజ్ఞానం ఉందని అనుకోనఖర్లేదు. ఈ టపా ముఖ్య ఉద్దేశం కూడా అది కాదు కాబట్టి దాన్ని పక్కన బెడదాము.


విషయం ఒకటే!
రెండు పత్రికలు.
ఇద్దరు విలేకరులు.
రెండు కోణాలు!
నాణేనికి రెండూ పార్శ్వాలు.
ఏది నిజం?
ఏ కధనం సబబు?
వృత్తిపరంగా ఎవరి కధనం సరైనది?
ఎవరి వార్త ని నమ్మాలి?

ఈ బ్లాగరి కధనం పక్కన బెట్టండి.పూర్తిగా చదవండి ...

అక్షర ఉద్యమం


కొత్త పాళీ గారు బత్తిబంధ్ కి పిలుపునిస్తూ కొంతమంది బ్లాగర్లను, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) మీద తమ తమ అభిప్రాయాలాను తోటి వారితో పంసుకోమన్నారు. ఆ సందర్భంలో ఒక బ్లాగరి - "భారతానికి కావలసింది దీపాలార్పడం కాదు. దీపాలు వెలిగించడం. both literally and metaphorically. వేల గ్రామాలు ఇంకా విద్యుద్దీపాలు చూడని దేశంలో నిజంగానే దీపాలు కావాలి. ఇరవై నాలుగ్గంటలు నియాన్ లైట్ల క్రింద కూచ్చునే వాడికి ఒక గంట ఆర్పేసు కూచ్చోవటం నావెల్టి. :౦) ఇంత పూనకమొచ్చినట్టు ఏదైనా చెయ్యాలనుకుంటే అక్షరదీపాలు వెలిగించడం గురించి ఎందుకు ఉద్యమించరు?" అంటూ ప్రశ్నించారు.

దానికి ఒక మేరకు కొంత సమాధానం ఇది. పత్రికల ద్వార జరుగుతున్న "అక్షర ఉద్యమం" కి ఒక పార్శ్వం మాత్రమే!
మిగతా పత్రికల ద్వారా " అక్షర ఉద్యమం" జరగడం లేదు, వారు చెయ్యడంలేదు అని ఇక్క డ చెప్పడం ఉద్దేశ్యం కాదు. కేవలం ఈ పత్రికలోని వార్త అందుబాటులో ఉండడంవలన దీనిని మీతో పంచుకోవడం జరుగుతున్నది.

అలాగే ఈ ప్రక్రియే "అక్షర ఉద్యమం" అని నిర్వచించబూనుకోవడంలేదు. ఇలా కూడా చేయవచ్చు, చేస్తున్నారు, ఇలాంటి సత్కార్యాలను, పత్రిక యాజమాన్యాలు ప్రోత్సహిస్తునే ఉంటవి అని చెప్పడమే ఈ టపా ఉద్దేశ్యం.

ఇక "అక్షర ఉద్యమానికి" ఎవరైనా ఒక రూప కల్పన చెసి, ఒక ముసాయిదా ప్రణాలిక తయారు చెయ్యడానికి ముందుకు వస్తే, వారికిదే ఇదే ఆహ్వానం.

పూర్తిగా చదవండి ...

అక్షరం తిరగ బడింది.

అక్షరం ఎదురు తిరగలేదు.
తిరగ బడింది
.

పెన్నుని గన్ను గా పట్టుకుని దేశాన్ని ఉద్ధరిద్దా మని అనుకునే వాళ్ళు కొంతమంది ఐతే, కులాలకతీతంగా, కలాన్ని అమ్ముకుని డబ్బులు సంపాదిద్దామనుకునే వారు మరి కొందరు. తమ చుట్టు ఉన్న సమాజంలో కుళ్ళుని చూసి, దాని శుభ్రం చెయ్యాలని, తమ చుట్టు పెరుగుతున్న కలుపు మొక్కలని ఏరి పారెయ్యాలాని దానికి ప్రసార మాధ్యమాలైన పత్రికలే తమ అక్షరానికి ఊతం ఇస్తాయని ఆ మార్గాన్ని ఎన్నుకుని మంచి పాత్రికేయులు కావాలని కొంతమంది. నేటి సమాజంలోని ఋగ్మతలకి క్షీణించిన సామాజిక విలువలే కారణం. కాబట్టి, ఉదాత్తమైన విలువలని మళ్ళీ ఈ తరానికి పరిచయంచేయ్యాలంటే మంచి సాహిత్యం కావాలి, మంచి సాహిత్యం అందరికి అందుబాటులో తీసుకెళ్ళాలంటే పత్రికలే తగిన సాధనాలు. ఆ పత్రికా విధులని సరిగ్గా నిర్వర్తించాలంటే దానికి తగిన విద్యార్హతలు నేర్వాలి.


అలాంటి విద్యని మన పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం నేర్పుతున్నది. అందుకని మన రాష్ట్ర రాజధాని ఐన భాగ్యనగరానికి చేరి అక్కడున్న ఆ తెలుగు విశ్వవిద్యాలయం లో ప్రవేశం పొంది, ఉత్తమ పాత్రికేయాన్ని అభ్యసిస్తూ, ఈనాడులోనో, అంధ్రజ్యోతిలోనొ, సాక్షి లోనో ఎదో ఒక తెలుగు పత్రికలో "వార్త" లు రాసే ఉద్యోగం సాధించలేకపోతామా, కలను సాకారం చేసుకోలేక్పోతామా అని ఈ "ఔత్సాహిక భవిష్యత్ పాత్రికేయులు" ఆ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చేరారు.


కాని వారికి తెలియదు, కరడు గట్టిన స్వార్ధంతో, ముక్కులు పగిలిపొయ్యే దుర్గంధంతో నిండిపోయిన ఆ పొట్టి శ్రిరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి కావల్సినది పని పాటా లేని ఉద్యోగం అనిన్ని, నెలాఖరికి జీతమున్ను, అవి రెండు పుష్కలంగా సర్కారు వారి కొలువులే మాత్రమే దొరుకుతాయి కాబట్టి దానీ చంపేయ్యకుండా, అలాగని పూర్తిగా ఆరోగ్యవంతంగా బతకకుండా ఉంటే, ఇలాంటి విద్యార్ధి దౌర్భాగ్యులు (అవును వారి దృష్టిలో, ఆ విద్యార్ధులందరూ దౌర్భాగ్యులే) వస్తూ ఉన్నన్నినాళ్ళు తమకి, తమ పదవులకి, జీతాలకి ఢోకా ఉండదని వాళ్ళు ఎవేవో కొత్త కొత్త ప్రణాలికలు వేసుకుంటు వచ్చినవాడి చెవులో - పూలు పెడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు.


ఇక ఆ పప్పులు ఉడకవని - తెలుగు విశ్వవిద్యాలయానికి పట్టిన తెగులుని తొలగిస్తామని విద్యార్ధులు ఏకంగా తెలుగు విశ్వవిద్యాలయం మీదే దావా వేసారు. బహుశ ప్రపంచకంలో విద్యార్ధులే విశ్వవిద్యాలయం మీద దావా వెయ్యడం ఇదే ప్రధమమైఉండాలి. మన పొట్టి శ్రి రాములు తెలుగు విశ్వవిద్యలయాన్ని అలాగున గిన్నెస్ బుక్ ఒఫ్ రికార్డ్స్‌లోకి, లింకా బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి ఎక్కించిన ఘనత కూడ తెలుగు వారిదే అవుతుంది.

దాని వివరాలు ఇక్కడ చూడండి.

హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే జాలంలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం గూడులొని వివరాలన్ని కూడా ఆంగ్లంలోనే ఉన్నవి. అది మన తెగులు విశ్వవిద్యాలయం సంగతి.


నమ్మరా? వెళ్ళి చూడండి! http://www.teluguuniversity.ac.in/


పూర్తిగా చదవండి ...

ఆత్మరక్షణ కోసం మా వాళ్ళు నాలుగు రాళ్ళు విసిరితే దాడిగా చిత్రించడం పద్దతేనా?

ఆంధ్రజ్యోతి మీద ఒక ప్రణాలిక ప్రకారం చేసిన దాడిని సమర్ధించుకుంటు, ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ అధ్యక్షుడిగా ఆయన అనవలసిన మాటలేనా ఇవి?

ఇది అన్నది హృద్రోగ చిన్నారులు, వికలాంగుల పక్షాన నిలబడి ఉద్యమించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు. ఎంతవరకు సబబండి ఈ మాటలు?

జూన్ 7 వ తేది, మంగళవారం, 2008 న ఈనాడు దినపత్రిక, మెయ్న్ ఎడిషన్, 4 వ పేజిలోని వార్తని ఇక్కడ చదవండి.పూర్తిగా చదవండి ...

మా ఉద్యమాలని కించ పరిస్తే ఊరుకోం!

ఉద్యామాలని కించ పరిస్తే ఊరుకోరటండి వీరు.

వారికి స్వేచ్హ కావాలి.

స్వతంత్రం కావాలి.

వారి అభిప్రాయాల్ని వెలిబుచ్చడానికి ప్రసార మాధ్యమాలు కావాలి.

వారిని ఆకాశానికేత్తసేటప్పుడు మాత్రమే పత్రికలు కావాలి, టీ వీలు కావాలి.

వారిని ఏ మాత్రం విమర్శిస్తున్నారన్న అనుమానం ఉన్నా,పెట్రొల్ కాని డిజెల్ కాని కిరోసిన్ పోసి, తగలబెట్టే హక్కు కూడా వారికే ఉంటుంది.

అప్పుడు మాత్రం ఆ పత్రికలు పనికి రావు.

ఆ టీ వీలు చూపే బొమ్మలు పనికిరావు.

వాటిలో పనిచేస్తున్న తమ "కులం" వాళ్ళైనా కూడా పనికిరారు.

వాళ్ళందరిని "కాటి" కి చేర్చడానికి కూడా వెనుకాడరు వీరు.

వారు, వారి ఉద్యమాలని కించ పరిస్తే ఊరుకోరటండి.
మంగళవారం 7 వ తేదిన, జూన్ 2008లో, పేజి 8లో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్త ఇక్కడ చదవండి.


పూర్తిగా చదవండి ...

సాహిత్యం, భాష, యాస, మాండలికం

సాహిత్యంలో కొంత మంది యాస, మాండలికం అంటూ తమ ప్రాంతంలొ వాడుకలోనున్న భాషని తమ రచనలలో ఉపయోగించుకుంటున్నారు. ఒకొక్కసారి అది చదివే వారికి అర్ధం కావడానికి శ్రమించవలసివస్తున్నది.

సాహిత్యంలో మాండలికం, యాస మీద నేటి దిన పత్రిక లో రామకృష్ణ గారి వ్యాసాన్ని ఇక్కడ చదవండి.పూర్తిగా చదవండి ...

వీళ్ళు ఆ పత్రికని బహిష్కరిస్తున్నారంట!

సైకిల్ మీద తిరిగిన రాధాకృష్ణ ఈ రోజు స్కోడాలొ, బెంజ్ కారులోను తిరుగుతున్నందుకు దుగ్దా, లేదా చలన చిత్ర రంగంలో ఒక అగ్ర తారని బడుగువర్గాల నేతగా ప్రస్తుతిస్తు వార్తలందిస్తున్నందుకు బాధ?

మరి ఇదే రాధాకృష్ణ యాజమాన్యంలోనే ఆంధ్రజ్యోతి బడుగులకోసం పోరాడుతున్న నేతలగురించి రాసినఫ్ఫుడు లేనీ ఆక్షేపణ ఈనాడెందుకు వచ్చింది?

అసలు విషయం ఏది?

* నేటి సాక్షి పత్రికలోని వార్త ఇది.


నిన్నటికి నిన్న లోక్‌సత్తా (మరాఠీ పత్రిక) సంపాదకుడు - కుమార్ కెట్కర్ మీద శివ సంగ్రాం సమితి సభ్యుల దాడి. మహరాష్ట్ర ప్రభుత్వం, ముంబై సముద్ర తీరాన కొన్ని కోట్ల ఖర్చుతో శివాజి విగ్రహాన్ని స్థాపించడంలోని ఔచిత్యాన్ని తన సంపాదికీయంతో ప్రశ్నించినందుకు ఆ మూక అతని ఇంటిమీద దాడి చేసింది. కొన్ని వేలమంది జీవానోపాధి లేక దుర్భర దారిద్రంతో బతుకు ఈడ్చుకుంటు, కొంత మంది చనిఫోతున్న నేపధ్యంలో ఆ విగ్రహన్ని గురించి ప్రశ్నించినందుకు జవాబు ఆ దాడి.

స్వార్ధ ప్రయోజనాల కోసం ఏ కొద్దిమందో ఇలాంటి "ప్రెజర్ గ్రూప్స్"గా తయారయ్యి, తమ కోరికలను సాధించుకోవడం కొరకు ప్రసారమాధ్యమాలని ఇలా "బ్లాక్‌మైల్" చెయ్యడం ముక్తకంఠంతో గర్హించాల్సిన సమస్య ఇది.లోక్‌సత్తా (మరాఠీ పత్రిక) సంపాదకుడు - కుమార్ కెట్కర్

పూర్తిగా చదవండి ...

ఆంధ్రజ్యోతి పై మరో ఫిర్యాదు - నేటి ఈనాడులో వార్త

కృష్ణ మాదిగ గారు, తమ కార్యకర్తల ప్రవర్తన (ఆంధ్రజ్యోతి మీద దాడి) ని ఏ విధంగా సమర్ధించుకుంటున్నారో మీకెవరికైనా తెలిస్తే చెప్పగలరు.


పూర్తిగా చదవండి ...

ఆవేశం తగదు

అంటూ ఆంధ్రజ్యోతి మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాడి మీద నేటి ఆ పత్రికలో ఇన్నయ్య వ్యాసం ఇక్కడ చదవండి.

పూర్తిగా చదవండి ...

ఐక్యంగా ఉద్యమిద్దాంఆంధ్రజ్యోతి మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాడి మీద నేటి ఆ పత్రికలో సంగిశెట్టి శ్రీనివాస్ వ్యాసం ఇక్కడ చదవండి.

పూర్తిగా చదవండి ...

దౌర్జన్యం దళితుల తత్వం కాదు


ఆంధ్రజ్యోతి మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాడి మీద నేటి ఆ పత్రికలో మల్లేపల్లి లక్ష్మయ్య వ్యాసం ఇక్కడ చదవండి.

పూర్తిగా చదవండి ...

ఆంధ్రజ్యోతి కులం

ఆంధ్రజ్యోతి మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాడి చేసిన సందర్భంలో,నేటి ఆ పత్రికలో కట్టా శేఖర రెడ్డి మాట ఇక్కడ చదవండి.
పూర్తిగా చదవండి ...

మా కులం కాదు, నీ కలం అమ్ముడుపోయింది

ఆంధ్రజ్యోతి మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాడి చేసిన సందర్భంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ సుభాషన్ రెడ్డి "శాంతియుతంగా నిరసనను వ్యక్తం చెయ్యలి గాని , దాడి చెయ్యడం ఎంతారకు సబబు అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణ మాదిగను ప్రశ్నించారు.

ఆ నేపధ్య వివరం ఇక్కడ సాక్షి లో చదవండి.
పూర్తిగా చదవండి ...