చిరంజీవి కోటబుల్ - కోట్ - ౧

Posted by netizen నెటిజన్ on Monday, November 24, 2008
పర్వతనేని ఉపేంద్ర ప్రజా రాజ్యం పార్టి లో చేరిన శుభసందర్భంలో - చిరంజీవి కొటబుల్ కోట్;

" పెద్దవాళ్ళకి ఆస్పిరేషన్స్  (aspirations = అభిలాషలు, ఆశలు, కోరికలు మొ.,) ఉండవు, కంసెర్న్స్  (concerns = అక్కర, చింత, వ్యాకులత మొ.,)ఉంటాయి.  వాళ్ళేదో లబ్ది పొందాలని రారు.  వారు ఆటగాళ్ళకి తర్ఫీదునిచ్చే శిక్షకులు. ఉపేంద్ర లాంటి సుధీర్ఘ అనుభవమున్న నేత చేరటం శుభ పరిణామం. "
  
* పై చాయా చిత్రం ఈనాడు దిన పత్రిక నవంబరు ౨౫, ౨౦౦౮, పుట ౧౧ నుండి
పర్వతనేని ఉపేంద్ర ఒక సామాన్య రైల్వే ఉద్యోగస్థుడిగా మొదలైనవాడు.  మరి ఆ రోజున ఏ "ఆస్పిరేషన్స్"  లేకుండానే  తెలుగుదేశంలోను, (అప్పుడేనా, సోనియా అంది, "నీ సంగతి తేలుస్తా" అని?), తరువాత కాంగ్రెస్‌లోను, మరి ఈ రోజున ప్రజారాజ్యం పార్టీ లోను చేరింది.  మరి ఉపేంద్రగారి దృష్టిలో "ప్రజలు" అంటే ఎవరో?  మొన్ననేగా,

"..ఖాళీగా ఉన్నాను, ఏం చెయ్యడం లేదు ,"
అని ఏదో ఇంటర్యూలో వాపొయ్యాడు.


ఎలా సంపాదించుకోవాలి, తన ప్రజలు ("ప్రజలు = తన స్వకుటుంబం - వారి ఆస్తి పాస్తులు ")ని ఎలా సంరక్షించుకోవాలన్న కంసర్న్ (concern) విషయంలో ఆయన ఆచరించి చూపుతాడేమో! దానిని అనుచరగణం  గమనించి, అనుసరించి సుక్షితులవ్వాలేమో!  ఇటువంటి గోముఖవ్యాఘ్రాలను, వృద్ధ జంబుకాలను చిరంజీవి దూరంగా ఎందుకని ఉంచడో!


Loading image
Click anywhere to cancel
Image unavailable

Loading image
Click anywhere to cancel
Image unavailableపూర్తిగా చదవండి ...

ఈ తెలుగు పదాలకు అర్ధం చెప్పరూ!మణుకు          = 
 
కక్కి                 =
 
కచికవన్నె          =
 
చిత్తరవు            =
 
కపిలవర్ణం         = 
 
అపాళం            =
 
పారావతనీలం   = 
 
బనాతు            =
 
తిక్తసుఖం         = 
 
పిక్కాసు          =
 
గోడిగ             =


ఇంకొన్ని అనుమానాలున్నవి, అవి తరువాత..పూర్తిగా చదవండి ...