ఈ తెలుగు పదాలకు అర్ధం చెప్పరూ!







మణుకు          = 
 
కక్కి                 =
 
కచికవన్నె          =
 
చిత్తరవు            =
 
కపిలవర్ణం         = 
 
అపాళం            =
 
పారావతనీలం   = 
 
బనాతు            =
 
తిక్తసుఖం         = 
 
పిక్కాసు          =
 
గోడిగ             =


ఇంకొన్ని అనుమానాలున్నవి, అవి తరువాత..

14 వ్యాఖ్యలు:

దైవానిక on November 15, 2008 at 1:40 AM   said...

కక్కి అంటె పిన్ని అనుకుంటాను. కపిల వర్ణం brown color. నాకు తెలిసినవి ఇవే

gaddeswarup on November 15, 2008 at 3:41 AM   said...

From Brown's Telugu-English Dictionary (A.p.SAHITYA academy, 19660
చిత్తరువు=picture, painting
కపివర్ణము=tawny, brown, colour of monkies
కపిల, కపిలె=pump
గోడిగ, గోడిగె== A mare
గోడిగ=steepness
The next ones are the closest ones that I could find.
తిక్తము=bitterness, adjective tikta?
పారావతము=dove, pigeon

చిలమకూరు విజయమోహన్ on November 15, 2008 at 5:04 AM   said...

పిక్కాసు అనేది తెలుగు పదం కాదనుకుంటా pickaxe త్రవ్వడానికి పనికి వచ్చే పరికరం వ్యవసాయంలో ఉపయోగపడుతుంది.

Unknown on November 15, 2008 at 1:43 PM   said...

Kachika vanne ante grey color, kachika means boodidha, pidakalu kalchaga migile dhanni kachika antaru.

gaddeswarup on November 16, 2008 at 3:40 AM   said...

From the Appendix containing words derived from Arabic, Hindustani etc to Brown:
బనాతు =Broad cloth, woollen
There is also a Telugu word in the list which is even more obscure సగళాతు
Perhaps racchabanda would be good place to enquire.

Anonymous on November 17, 2008 at 11:19 PM   said...

నెటిజన్‌కి ఈ పదాలకు అర్ధం తెలియక ఇక్కడ అడగలేదు, బ్లాగ్మిత్రులారా.

ఈ బ్లాగు ప్రపంచంలో, ఈ బ్లాగు చదివే వారిలో, మన తెలుగు భాష మీద ఎంతమందికి ఈ పదాలకు అర్ధం తెలిసి స్పందిస్తారు అని చూద్దామని ఒక చిన్న "దురాశ" పుట్టి అడగడం జరిగింది.

స్పందించిన బ్లాగ్‌ మిత్రులు వీరు:

@ దైవనిక: మీరు ఊహించారా లేక తెలుసా? మీ జవాబు సరైనదే! కక్కి అంటే "పిన్ని".

@గద్దే స్వరూప్ గారు: శ్రమ తీసుకుని నిఘంటువుని వెతికి పట్టుకుని మరీ జవాబులు ఇచ్చారు. "మేర్" కి తెలుగులో అర్ధం ఏమిటో? పిల్లి అంటే మార్జాలం లాగ అడుగుతున్నాడేమిటి అనుకుంటున్నారా? నెనరులు (అర్ధం అడగవద్దు..:))

@ చిలమకూరు విజయమోహన్: అవును అది పిక్‌ఆక్స్ . తెలుగు పదం కాదు. ధన్యవాదాలు.

@ ఇందు: మీరన్నదే సరైన అర్ధం. కచ్చికలతో పళ్ళు తోముకుంటారు. అవును. మీకు థాంకులు.

మళ్ళీ @ గద్దె స్వరూప్ గారికి: అది కూడా సరైన అర్ధమే. రచ్చబండ దాక అఖ్ఖ్‌‌ర్లేదండి. ఇంకా మిగిలిన పదం ఒకటుంది.

అది: మణుకు = ?

నిఘంటువు దాకా వెళ్ళకుండా ఎవరైనా చెప్తారేమో చూద్దాం!!!

సుజాత వేల్పూరి on November 18, 2008 at 1:34 AM   said...

నెటిజెన్,
నేను ఆ దురద తోనే నిఘంటువు జోలికి వెళ్ళకుండా సందర్భానుసారంగా ఈ పదాలు ఎక్కడైనా ఉపయోగించి ఉంటారా అని వెదుకుతున్నాను అర్థాలు.

అపాళం, బనాతు మాటలకు అర్థాలు తెలీక మొత్తం కలిపి రాదామని ఆగాను,.

గోడిగ అంటే ఆడగుర్రం అట(మా అత్తగారు చెప్పారు)
కచిక అంటే పిడక కాలగా వచ్చునది కాబట్టి కచిక వన్నె అంటే బూడిద రంగు !మిగిలినవి స్వరూప్ గారు చెప్పినట్టున్నారుగా, నేను చెప్దామనుకుంటుండగానే!

Anonymous on November 18, 2008 at 1:42 AM   said...

@ సుజాత; మీ అత్తగారిచ్చిన అర్ధం సరైనదే! మీ అత్తగారికి కూడా అంటించారా? మీ "దురద" కి జోహార్లు.

సరే, మరి మణుగు అంటే? :)

Dreamer on November 18, 2008 at 2:28 AM   said...

నాకు తెలిసినంతవరకూ మణుగు అంటే బరువుని కొలిచే ప్రమాణం, కానీ మణుగు అంటే ఎంతో తెలియదు :(

బారువు అంటే ఏమిటో కూడా చెప్తారా ఎవరైనా?

gaddeswarup on November 18, 2008 at 1:09 PM   said...

Thanks for recalling interesting words. I have been away from A.P. (mostly) since 1956 but Telugu still fascinates me. I am just trying to keep in touch with the language through dictionaries, books and blogs.

gaddeswarup on November 18, 2008 at 1:42 PM   said...

Somewhat off topic.
I have been trying to make digitally available 'Adhunika vyavaharakosam' by Budaraju Radhakrishna. I understand from the publisher that he has given it for digitization and it will be available on the net in a few months. I think that the dictionary started as a course for Eenaadu journalists showing equivalent Telugu words for common English words in newspapers. I find that now in blogs many useful Telugu words are reappearing. I wonder whether some efforts can be made to supplement Budaraju's efforts to make digitally available useful Telugu words where many are using English words. It will be useful for people like me living abroad if we want to write in Telugu.

సుజాత వేల్పూరి on November 22, 2008 at 8:23 AM   said...

మణుగు బరువును తూచే ఒక ప్రమాణం:
మణుగు అనగా ఎనిమిది వీసెలు
బారువు అనగా పన్నెండు మణుగులు అంటే 96 వీసెలన్నమాట.

సత్రాజిత్తు దగ్గరున్న శమంతక మణి రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చేదిట. అబ్బ, అలాంటిది ఒకటి కనీసం ఒక్క రోజున్నా మనదగ్గర ఉంటేనా...చించెయ్యమూ!

Anonymous on November 26, 2008 at 7:40 AM   said...

@గద్దె స్వరూప్: తప్పకుండా. మీరు ఈ సమూహంలో సభ్యులు కండి. http://groups.google.com/group/telugupadam?hl=te, అలాగే ఇందులో కూడా - http://etelugu.org/. అక్కడి సభ్యులతో మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు.
**
@ సుజాత: మీరన్నట్టు మణుగు, బరువును తూచే ఒక ప్రమాణం అన్నది సరైన అర్ధమే.

కాకపోతే, అడిగిన అర్ధం ఈ పదానికి - "మణుకు".

ఉదా:..పరికిణి అంచుకున్న చిరుగులోంచి పైకి కనబడుతున్న నా మోకాలు "మణుకు" పైన చప్పున అరచేయి వేసుకుని. ( ఈ వాక్యం తొలి ఉపాధ్యాయుడు - ఐతమాతోవ్ వ్రాసిన దానికి ఉప్పల లక్ష్మణ రావు తెలుగు అనువాదం, హై.బు.ట్ర వారి ప్రచురణ, పుట ౨౮ నుండి).

Post a Comment