హరి హర్షణీయుడు, కాని శివ భక్తుడు శివుడికి భక్తుడు కాదు

Posted by netizen నెటిజన్ on Saturday, October 23, 2010
ఓటు వోటు మెషిన్ గురించి మనకి వివరంగా, విడమరిచి, వివరించిన పాపానికి కారాగారంలో పడేసిన మన తెలుగు హరి ని ప్రపంచం గుర్తించి హర్షిస్తుంటే,  దానికి హర్షించాలా, లేక ఆ శివభక్తుడి ప్రభు భక్తికి మొకరిల్లలా?


ఈనాడులో హరి మీద కథనం
ఇక శివభక్తుడు, వారి కథ!
మొన్న ఈనాడులో రింగ్ రోడ్డు మీద కథనంలో చాల మంది పెద్ద గద్దల ప్రమేయం ఉందని కుండబద్దలు కొట్టి మరి చెప్పింది.  అలాగే ఎమ్.ఆర్. ప్రాపర్టిస్ విషయంలో కూడా బకాసురుల ఆకలి తీరలేదని ప్రసారమధ్యామాలు తెలిపాయి.  మధ్యలో ఈ భూముల కి సంబంధించిన పత్రాలున్న కార్యాలయంలో అగ్ని ప్రమాదం.  పెద్దల చేతికి మట్టి అంటకుండా పాపం పార్వతివల్లభుడు తన త్రినేత్రంతో అడ్డుకున్నట్టున్నాడు.

అయ్యా, అది అగ్నిదేవుడి వ్యవహరం కదా? ఇందులో ఓంకార నాధుడి ప్రమేయం ఉంది అంటారా?  అని సందేహంబు వలదు.  ఉంది, ఉంది, వస్తున్నా, వస్తున్నా!

రామకృష్ణా సముద్ర తీరాన ఒక భూ భక్తుడున్నాడు.  ఆయన తనదినచర్యని ఓంకార నాదంతోనే మొదలుపెడతాడట.  ఆ భక్తుడికి తనమీదున్న భక్తికి మెచ్చిన పార్వతినాథుడు, అతని మీద ఎటువంటి అపవాదుని వాలనీయకుండా, తానే స్వీకరించి తన గరళకంఠలో నిలుపుకుని భక్తుడి సేవలో తరిస్తాడంట.  


 ఆ సదరు శివభక్తుడే నంట, తెలుగు లలిత కళాతోరణాన్ని, రాజీవ్ కళాతోరణం గా మార్చడానికి ధనం సమకూరుస్తున్నది.  ఆర్ధికమంత్రి గా "విపరీతమైన అనుభవం" ఉన్న ముఖ్యమంత్రిగారికి విత్తుకి ఉన్న అర్ధిక బలం తెలుచును గాని, "తెలుగు" పదాన్ని కున్న తీయందనం తెలియకపోవడంలో ఆశ్చర్యమేమున్నది?

6 వ్యాఖ్యలు:

సుజాత వేల్పూరి on October 23, 2010 at 10:05 PM   said...

రెంటికీ లింక్ బాగా పెట్టారు.

ఈ లలిత కళా తోరణం మాటే నన్ను దిగ్భ్రాంతి పరుస్తోంది. ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నవీకరించబోతున్న ఈ రాజీవ్ కళా తోరణంలో సామాన్య కళారాధుకుడికి ఏమాత్రం ప్రవేశం లైభిస్తుందో ఊహించ దగిన విషయమే!

రాజీవుడికీ తెలుగు కీ రాజీవుడికీ లలిత కళలకూ సంబంధం లేకపోవచ్చు గానీ రాజీవ్ కీ సుబ్బిరామిరెడ్డికీ, సుబ్బిరామిరెడ్డికీ డబ్బుకీ, వెరసి పదవి కీ రోశయ్యకూ ఉన్న బంధం గొప్పది! అందుకే తెలుగు ని హత్యచేసి అసెంబ్లీకీ కళా తోరణానికీ మధ్య ఉన్న మ్యూజియమ్ లో దాపెట్టే ప్రయత్నం !

దీన్ని ఇలాగే వదిలేస్తే కొన్నాళ్లకి రాష్ట్ర ప్రజలంతా ఇంటిపేరు ముందు రాజీవ్ నో, ఇందిర నో చేర్చుకోవాలని చట్టం చేసేట్లున్నారు , ఖర్మ!

Anonymous on October 24, 2010 at 1:31 AM   said...

ఇది కళాపోషణా.. కాంగ్రెస్ పోషణా??
http://amtaryaanam.blogspot.com/2008/05/blog-post.html

netizen నెటిజన్ on October 24, 2010 at 7:48 AM   said...

@amtaryaanam:
మేము రాజాకీయవేత్తలము, ప్రజాస్వామ్య పరిరక్షకులమనే ఈ పెద్దలు, బహిరంగంగా నడిరోడ్డు మీద వివస్త్రను చేసి జరుపుతున్న రాక్షస రతి క్రీడ ఇది!

అసలు, సిసలు, పదహారణాల నిఖార్సైన అవినీతి కాంగిరెస్సు పోషణ!

@durgeswara:
తెలుగు వారు అంత నిర్యీర్యులైపొయ్యారా! తెలుగు వారు షండులా?

@సుజాత:
మీరన్నమాట (దివంగత) రాజీవశేఖరుడు ఎప్పుడో మొదలు పెట్టారు. గమనించలేదా?

Kalpana Rentala on October 24, 2010 at 9:50 AM   said...

ఏమైపోయారు నేటిజెన్ గారు?

ఇప్పుడు వస్తే ఈ మధ్య చాలా పోస్ట్ లే పెట్టినట్లు వున్నారు. మరి నేను ఎలా మిస్ అయ్యానో?

netizen నెటిజన్ on October 24, 2010 at 10:34 PM   said...

@Kalpana Rentala:
ఎలా ఉన్నారు, బాగున్నారా?..:)

Post a Comment