శ్రీ శ్రీ విగ్రహాన్ని తీసెయ్యాలి - జూలురి గౌరిశంకర్

మొన్న భా.జా.ప విద్యాసాగర్, కలువకుంట్ల చంద్రశేఖర్ గారి తనయుడు తారక రామారావు, ఎదో ఒక సభలో, టాంక్ బండ్ మీద కొమరం భీమ్ విగ్రహానికి స్థలం లేదని ప్రభుత్వం అంటే అక్కడ ఉన్న విగ్రహలని తీసేసైనా తమ కొమరం భీమ్ విగ్రహన్ని వేసుకుంటామని అన్నారంట. అది ప్రస్తుత వివాదానికి నేపధ్యం.

అటుమొన్న శ్రీకృష్ణ కమిటి కి తె రా స ఇచ్చిన విన్నపాలలో ఆంధ్ర పాలకుల పక్షపాతధోరణి కి నిలువెత్తు సాక్షాలు టాంక్‌బండ్ మీద తెలుగు వెలుగుల విగ్రహాలు అని అన్నారు.

ఇక నిన్న సాయంత్ర ప్రయోక్త స్వప్న గారి సారద్యంలో  సాక్షి టి వి లో జరిగిన చర్చ లో కొన్న అంశాలు.

ప్రస్తుత ప్రత్యేక రాష్త్ర సాధనకొరకు చేస్తున ఉద్యమ నేపధ్యంలో జూలురి గౌరిశంకర్ ఒక ప్రశ్నను లేవ దీసారు.
జూలురి గౌరిశంకర్, తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శి

"తెలంగాణా కొరకు శ్రీశ్రీ ఏం చేసాడు? తెలంగాణా పోరాటాన్ని ఆయన ఎందుకని గుర్తించలేదు?   అందుకని ఆయన విగ్రహాన్ని తీసెయ్యాలి. మమ్మల్ని మా ఉద్యమ స్ఫూర్తిని గుర్తించని వారి ని మేమెలా సహిస్తాము?" అని అంటారు శ్రీ జూలూరి.

శ్రీ శ్రీ ప్రాణాలతో ఉండి ఉంటే, ఈ ప్రస్తుత తరుణంలో, "మా తెలంగాణా గురించి నువ్వెందుకు రాయలేదు" అని కచ్చితంగా అడిగే వాడిని అని ఆంటూ, "ఇప్పుడు  రాయి" అని కూడా అడిగే వాడినన్నారు.

"మేము మా సుద్దాల హనుమంతు ని, మా కాళోజి ని, మా వట్టికోట ఆళ్వారు స్వామి ని,  మా దాశరధి విగ్రహలని అక్కడ వేసుకుంటాం. మేము ఇప్పుడు మా తెలంగాణ కళాకారులకు, కవులకు జరిగిన, జరుగుతున్న అవమానాలను ప్రశ్నిస్తున్న సందర్భంలో మాత్రమే కోస్తాలలోను, రాయల సీమలోను తెలంగాణ కళాకారుల విగ్రహాలను  ప్రతిష్టించుతాం అని అనటం లో ఔచిత్యమేమున్నది", అని కూడా ప్రశ్నించారు వారు.

విరసం సభ్యుడు చలసాని ప్రసాద్, (ఫోన్‌ ఇన్‌లో) "ఉన్న విగ్రహాలను తీసెయ్యకుండా, సామరస్యంగా, సృహృద్భావ వాతవరణంలో, సమస్యను, సహేతుకంగా, సంయమనంతో పరిష్కరించుకోవచ్చ" ని అన్నారు.  అల్లూరి సీతారామ రాజు మరణానంతరమే కొమరం భీం చనిపొయ్యాడని, ఆయన విగ్రహాన్ని సీతారామరాజు విగ్రహం పక్కనే ప్రతిష్టించవచ్చునని కూడ సూచించారు. శ్రీశ్రీ విగ్రహాన్నో, ఉన్న మిగతా వారి విగ్రహాలనో తీసేయ్యడం మంచిది కాదన్నారు.

ఇక చర్చలోకి వచ్చిన ఎ.బి.కె ప్రసాద్ గారు (ఫోన్‌ ఇన్‌లో) అసలు ఇప్పుడు ఈ విగ్రహాల మీద ఈ చర్చ అనవసర రాధ్హాంతం కాదా అని ప్రశ్నిస్తూ, మఖ్దూం, సురవరం, పోతన ఎక్కడి వారని జూలురి ని ప్రశ్నించారు.  ఆ ముగ్గురు నలుగురేనా ? అని శ్రీ జూలురి గారి జవాబు.
ఈ చర్చలో చలన చిత్ర దర్శకుడు - చిట్టిబాబు కూడా పాల్గొన్నారు(ఫోన్‌ ఇన్‌లో).  మహా కవి శ్రీశ్రీ  ది విశాలమైన దృష్టి అని ఆయనని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం తగదని అన్నారు.

ఇక స్వప్న "  శ్రీశ్రీ అందరి వాడు కాకుండా, కొందరి వాడయ్యాడా ?" అని జూలురిని ప్రశ్నిస్తే,  వారి జవాబు.
"శ్రీశ్రీ అందరి వాడైనా , తెలంగాణా వారికి మాత్రం కొందరి వాడయ్యాడు" అని.
11 వ్యాఖ్యలు:

మాగంటి వంశీ మోహన్ on October 26, 2010 at 8:37 AM   said...

వెఱ్ఱి భాఘా ముదిరిందండోయి ! ముదిరింది...

ఆయనెవరో అన్నట్టు జూలూరు వారిని సాలూరు పంపించిన్నూ, కుక్కపాలు తాగించిన్నూ, దిష్టి అన్నం నోట్టో కుక్కితేనూ సరి!

వెఱ్ఱీ సరీ, శ్రీ శ్రీ సరి

rakthacharithra on October 26, 2010 at 9:41 AM   said...

ట్యాంక్ బండ్ మీద ఉన్న ప్రతి విగ్రహానికి ఒక మహోన్నత చరిత్ర ఉంది. ఒక వేళ సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కు ఏ కర్నులో, విజయవాడో రాజధాని అయి ఉంటె అక్కడే ఈ విగ్రహాలు ఉండి ఉండేవి. ట్యాంక్ బండ్ మీద తెలంగాణా కు సంబంధం లేని విగ్రహాలని తొలగిస్తామని లంగా KTR , విద్యాసాగర్ రావు అనడం వాళ్ళలో తాలిబాన్ సంస్కృతిని సూచిస్తుంది. తాలిబాన్ లు ఆఫ్ఘానిస్తాన్ (బయమిన్ ) లో కొలువుదీరి ఉన్న బుద్ధుడి విగ్రహాలను ట్యాంక్ లతో పడగొట్టినట్లు లంగా వేర్పాటు వాదులు ఇక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను వాళ్ళ జన్మ లో తీయ్యలేరు.

అబ్రకదబ్ర on October 26, 2010 at 12:38 PM   said...

కొమరం భీమ్ మీద అంత ప్రేమ కారిపోతుంటే ఇన్నేళ్లలో తెలంగాణలో ఆయన విగ్రహాలు పెట్టకుండా ఎవడాపాడో ఈ పెద్ద మనుషుల్ని?

ఓ పక్క తెలుగు వాళ్ల రాజధానిలో ప్రతి దానికీ రాజీవ్ పేరు తగిలించేస్తుంటే దానికి లేని అభ్యంతరం సాటి తెలుగువాళ్ల విగ్రహాలు కొన్ని ట్యాంక్‌బండ్ మీద కొలువుంటే వచ్చేసింది వెధవాయిలకి. వెర్రి ఓ రేంజిలో ముదర్లేదు వీళ్లకి.

ప్రేమతో...మీ on October 26, 2010 at 8:57 PM   said...

.....ఎక్కడికి దిగజారి పొతున్నామొ అర్థం అవుతుందా????కొమరం భీం గారి విగ్రహప్రతిష్ట కి ఎవరు అడ్డుపడుతారు, అందరం మంచిని స్వాగతించే వాళ్ళమే కదా.

సుజాత on October 26, 2010 at 9:36 PM   said...

వంశీ గారు సూచించిన ట్రీట్ మెంట్ బాఘా పని చేస్తుందని నాకు నమ్మకం ఉంది. నిజానికి వెర్రి కూడా దాటి సంధిగా పరిణమించింది.

మొల్లది, కృష్ణ దేవరాయలు దీ, నన్నయ్యది, వీరబ్రహ్మేంద్ర స్వామిదీ, శ్రీనాధుడిదీ, వీళ్ళెవ్వరిదీ తెలంగాణా కాదు. వాళ్ళని కూడా లేపేద్దాం! (వాళ్ళ కాలంలో తెలంగాణా ఉందా లేదా అనే ప్రశ్న అక్కర్లేదు. ఎందుకంటే విగ్రహాలున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళా కాదా అనేదే ప్రశ్న ఇక్కడ)

తెలంగాణాలో ఎక్కడైనా (హైద్రాబాదు కాకుండా) వట్టికోట ఆళ్వారు స్వామి,కొమరం భీమ్,కాళోజీ గార్ల విగ్రహాలు ఎన్ని ఉన్నాయో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు!

netizen నెటిజన్ on October 27, 2010 at 1:05 AM   said...

@మాగంటి వంశీ మోహన్:
ఇంకా ఇలాంటి విపరీతమైన ఆలోచనా ధోరణులు ఎన్నో వస్తాయి.

@రక్తచరిత్ర:
అరిచి గీపెడితే లాభంలేదు. వారు ఉద్యమం నడుపుతున్నారు. కాబట్టి వారికి తోచినట్టు వారి వాదాన్ని వినిపిస్తారు.

@REDDY:
అది వారి ఆలోచనా ధోరణి.

@అబ్రకదబ్ర:
జూలురి గౌరిశంకర్ మరొక మాట అన్నాడు. కావడి బద్ద లాగా కలిసిఉందాం, కాని కావడి కుండలలాగా విడిపోదాం అని. కె సి ఆర్ మాట ప్రకారం మీరంటున్న "సాటి తెలుగువారు" ఏ తల్లి బిడ్డలు?

@ప్రేమతో...మీ:
అవును, నిజమే!

@సుజాత:
అర్ధం లేని ఆరోపణలు ఇవి. చలసాని ప్రసాద్ గారి మాటల్లో "స్టాలిన్ అంటే వల్లమాలిన ప్రేమ శ్రీ శ్రీ కి. కాని స్టాలిన్ చనిపోయినప్పుడు ఆయన గురించి శ్రీ శ్రీ ఏమి వ్రాయలేదు. ఇంకేవరో వ్రాసారు". దానికి మనమేం చెబుతాం?

** రేపు డిసెంబరు 31 తరువాత ఏం జరుగబోతున్నది అన్నదే..ప్రసార మాధ్యామాల మధ్య జరుగుతున్న చర్చ!

critic on October 27, 2010 at 2:31 AM   said...

ఈ అసహనం ఏమిటసలు? ఏ ఉద్యమాన్నయినా గుర్తించాలనుకున్నవారు గుర్తిస్తారు, లేకపోతే లేదు. సమర్థించాలనుకున్నవారు సమర్థిస్తారు. ఈ బలవంతాలేమిటి? బెదిరింపులేమిటి? బతికున్నవాళ్ళను ఘెరావులు చేసి, బలవంతంగా అనుకూల ప్రకటనలు చేయించుకుని, జేజేలు కొట్టించుకోవటంతో సరిపెట్టకుండా, చనిపోయిన కవులను కూడా దీంట్లోకి లాగుతున్నారన్న మాట!

మహాకవి శ్రీశ్రీ ఊరడించిన పతితులూ, భ్రష్టులూ, బాధా సర్పదష్టుల్లో తెలంగాణ నిరుపేదలు కూడా ఉన్నారని గ్రహించనివాళ్ళకు ఎంత చెపితే మాత్రం తలకెక్కుతుంది?

New @ Diffrent on November 24, 2010 at 8:59 AM   said...

శ్రీ శ్రీ గారు బతికి ఉన్నపుడు జూలురి గౌరిశంకర్ గారు ఇంక పుట్టలేదనుకుంట ఈ మహానుబావుడు ఏమద్యే పుట్టి తెలంగాణా ని ఉద్దరిన్సుదామని బయలుదేరారు.

jesu on April 25, 2011 at 12:45 PM   said...

prantala variga vidipodhama? Endukani Eelagu? Evari Swardham Indulo? Swardhaparulu Eeroju vuntaaru repu pothaaru... kaani andhra pradesh janam chirakaalam vundalu kalasi kattuga... kalasivunte kaladu sukam annaaru peddalu... endukani meeku adi pattatledu? telangana evaridi? seemandhra evaridi? Andaramu kalasi enduku avineethi meeda poradakudadu? andhra lo avineethi entho undi... evineethi parulu chalamandi manaku kanbaduthunnaru... varitho poratam cheyadaniki andharam kalisi nadavali.... college kurrollanu enduku induloki laguthunnaru? chanipoina margadarshakulanu enduku induloniki laguthunnaru? siggu lekunda danikosam poraduthunnaru... eppudaina avineethi kosam evariana poratam chesara? eevidhamga poratam kosam college kurrollanu vadukunnara? enthomandi chanipothunnaru... vrudhaga..... avineethi kosam poradudam.. avineethini andhra nundi tharimikodam... idi eerojuna mana madhya vunna samasya... telangana samasye kaadu.... rajakiya bada babulu.. chestunna rabasa... avineethi kukkalu matladuthunna... Ardham leni Matalu.... Telangana kosam kadu.. avineethi kosam poradandi.. sama samaaja sthapana sadhyamouthundi..

jesu on April 25, 2011 at 1:00 PM   said...

ninna monnatidaka leni kotha kotha samasyalu enduku levadeestunnaru.... mahanubhavula meedaku enduku veluthunnaru? vigrahalu emichesayi... ade nee vigrahamaithe emi chestaaru? enduku chanipoinavari meeda gouravam ledu?

Inthati poratam edo avineethi meeda enduku cheyaru? Andhra Pradesh lo Avineethi kuppalu kuppaluga peruku poindi dani gurinchi enduku alochincharu? avineethi parulapai enduku udyamalu cheyaru? nijaithiga enduku matladaru? bada babulu swis bankullo avineethi sommutho nimpukuntunte vari gurinchi enduku vyasalu vrayaru? janam kosam poratalu chesi chanipoina vari meeda enduku matladutunnaru?

Dammunte avineethi meeda poratalu modalupettandi lekunte chetakadu ani kurchondi... anthe kaani manubhavulai cahnipoinavari meeda mee pratapam... leka... brathikunna amaayakulaina vari prajalameeda mee dowrjanyam? college kurrollanu recchagotti.... vari bhavishyatthunu... kalarastunnare... idi meeku bhavyama?... ade poratam avineethi kosam poradandi... varilo kooda avineethi meeda... asahyam puttinchandi... adi eejananiki meeru chayagaligina manchi.. avineethi meeda matladandi... vyasalu vrayandi... prajallo... chaitanyam theesukurandi... kurralla gundello... neethi jyothini veliginchandi... jaihind...

Post a Comment