నీ యెనక వొస్తానంటుండ్నా ఆ "చిరంజీవి"?


Behind every man there is a woman అన్నది నువ్వు వినలేదా దత్తన్నా? రాజాశేఖరుడి వెనక ఎవరుంటారే, దత్తన్న? ఆయన పెండ్లం జీవిత ఉంటుందే. ఇంకెవరన్నా ఉన్నారని నీకు తెలిస్తే చెప్పవే! వారి సంగతి కూడ జర చూస్తరీ "చిరు" తమ్ముళ్ళు? దత్తన్న, నీ యెనక వొస్తానంటుండ్నా ఆ "చిరంజీవి"? అందుకని నువ్వంటున్నావా, దత్తన్న.
తప్పే అది, దత్తన్న.

* * *

తూ.గో.జి (అంటే తూర్పు గోదావరి జిల్లా) కోరుకోండ మండలంలో బడా "తమ్ముడు" నాగబాబు గారు అన్న కుటుంబసభ్యులతో రహస్య సమావేశాలు, మంతనాలు సమాలోచనలు సాగించారంట.


ఆ ఇందులో ఏముంది, "తమ్ముడు" పవనుడి "సహజీవనం" గురించో, మరి అన్న తనయ వివాహం గురించో మీరు అనుకోవచ్చుగాని అది పొరబాటన్నా.

వారి బంధులెవరో తెలుసుకున్న తరువాత మీరు మాట్లడితే బాగుంటుంది.
బంధువులెవరా, వారు అన్న అభిమానులండి.

మరి వారేనా రాజశేఖరుడిని, జీవితని వారి పిల్లల్ని భీమవరం నుండి, అదేదో "డిస్కవరి", "అనిమల్ వోర్ల్డ్" టీ.వి చానెల్స్లో - పులి జింకని వెటాడినట్టు చూపిస్తారే, అలా వేటాడి, గుడివాడ, గుంటురు, సత్తెనపల్లి, సికింద్రాబాదు స్టేషను, పంజగుట్ట, బషీర్‌బాగ్, జూబిలి హిల్ల్స్ చెక్‌పోస్ట్ లన్ని తిరిగి, రాళ్ళు విసిరింది?

కాదు.

ఇక్కడ "తమ్ముడు" నాగబాబు రహస్యసమావేశాలు, మంతనాలు, సాగించింది "రిజిస్టర్డ్ ఫాన్స్"తోటి. "రిజిస్టర్డ్ ఫాన్స్" సుశిక్షితులు, క్రమశిక్షణకు మారు పేరు వారు. వారు అలాంటి పనులు చెయ్యరు. అందుకే వారు అన్న కుటుంబానికి దగ్గిర బంధువులయ్యారు. వారితోనే నాగబాబు సమాలోచన చేసింది.

మరి దాడి చేసినవారు "ఫాన్స్" కదా?
కాదు.
ఎందుకంటే వారు "అన్‌రిజిస్టర్డ్" ఫాన్స్ ఐవుండవచ్చు.
ఒహొ. అలాగా.
అవును, అలాగే.

అంటే ఇప్పుడు రాజశేఖరుడి కుటుంబం మీద దాడి చేసింది అన్న అభిమానులు కదా?
కాదు. మరి రొక్కించి అడగకు. చిరాకేస్తుంది. తరువాత "మనస్థాపం చెందిన రిజిస్టర్డ్ ఫాన్" లు తీసుకునే చర్యలకూ మేము బాధ్యులము కాము.

వివరంగా చెప్పమంటావా. ఈ దేశ జనాభ ఎంతా? కొన్ని వందల కోట్లు, లేదు, ఒక బిలియన్ ప్లస్. సరేనా? అందులో ఎంతమందికి ఓటు వేసే హక్కు ఉన్నది? ఆ హక్కు ఉన్నవారిలో ఎంతమందికి "రిజిస్తర్డ్" అంటే "వొటర్ కార్డ్" ఉంది.

ఇది అంతే. అభిమానులుంటారు. వీరాభిమానులుంటారు. మనస్థాపం చెందినవారుంటారు. "రిజిస్టర్డ్ అభిమాని" ఉంటాడు. ఇప్పుడు రాజశేఖరుడి మీద రాయి విసిరింది, ఆ "వోటు" లేనివాడున్నాడే వాడు అన్న మాట.

రేపు ఒకవేళ చిరంజీవి, పార్టి పెట్టి, ఎలక్షన్‌లో నిలబడిన అభ్యర్ధి ఓడిపోతే, మీరు మూట ముల్లే సర్దుకుని, పరాయి రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు మొదలుబెట్టండి. ఒకవేళ ఓపిక ఎక్కువ ఉంటే, ఎలాగు, యూ ఎస్ ఆఫ్ ఏ ఉండనే ఉంది. అక్కడికి పొండి. బతికి ఉంటే బలుసాకనా తినవచ్చు!

అదేం మాట?

అంతే.
చిరంజీవి కి రాజకీయానుభవం లేదన్న వ్యక్తిగత అభిప్రాయాన్ని ఏ మాత్రం భరించలేని ఈ దేశంలో, రేపు తమ పార్టి అభ్యర్ధికి వోట్లు వెయ్యలేదని ఈ "రిజిస్టర్డ్", "అన్‌రిజిస్టర్డ్", "నోన్", అన్‌నోన్" అభిమానులు, మీమీద రాళ్ళు విసరరని ఏమిటి? తాజాకలం: ఆ "అన్‌రిజిస్టర్ద్" అభిమానులున్నారే వారు లొంగి పొయ్యారంట. ఇక్కడ చదవండి.

తమ్ముడు పవన్ తన "కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్" రాజశేఖరుడి కుటుంబానికి రక్షణ ఇస్తుందని ప్రకటించారు. మీరు కూడా అర్జి పెట్టుకోండి. మీకు రక్షణ కలిపిస్తాడు! మనలో మాట మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు?

3 వ్యాఖ్యలు:

తెలుగు అభిమాని on January 29, 2008 at 9:21 AM   said...

ఎందుకు బాస్ చిరంజీవి పైన ఈ అకారణ ద్వేషం. నిజాయితీగా చెప్పు. కులమేనా. ఎందుకు ఇంత బాధ పడిపోవటం. అతను రాజకీయల్లో రాణించేది లేనిది ప్రజలే నిర్ణయిస్తారు. తన టైమ్ బాలేక ఏవో ఇబ్బందులతో ఉంటే ఎందుకీ పైశాచిక ఆనందం. పవన్ కళ్యాణ్ రేణు ల సహజీవనం నీకు ఏవిధంగా ఇబ్బంది చెప్పు. ఆలుమగలు compatibility లేనప్పుడు విడిపోతే తప్పేముంది. ఇక విలువల గురించి చెప్పాలంటే మానసిక వ్యభిచారం చేయని మనుషులు ఎవరున్నారు? నువ్వు, నేను ప్రతి ఒక్కడు చేసిన/ చేస్తున్న వాళ్ళమే. గుండెల మీద చేయి వేసుకొని చెప్పు. కాదంటావా? ఈ కుల పిచ్చితో నీలాంటి చదువుకున్న వాళ్ళు సాధించేది ఏముంది. jara fresh socho yaar.

Satyam on January 29, 2008 at 11:27 AM   said...

తెలుగు అభిమాని - ఇంతకీ మీ అభిమానం వెనక ఉన్నదేమిటి? కులమేనా? మరేమైనానా?

సుబ్బు. on April 9, 2008 at 9:20 PM   said...

Registered fans raktam istaru
Un-Registered fans raktam vachela kodataaru

Post a Comment