మీ దగ్గిరలోని గ్రంధాలయాలు

కిరణ్ గారికి నెనర్లు!
చక్కటి విషయం మీద టపా వ్రాయమన్నారు.
పైగా ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం.


మీ దగ్గిరలోని గ్రంధాలయాలు

పుస్తకాలు, ఎటుచూసిన పుస్తకాలు.
బొమ్మలతో పుస్తకాలు.
రంగు రంగు బొమ్మలతో పుస్తకాలు.
రంగు రంగు బొమ్మల అట్టలతో పుస్తకాలు.
దళసరి అట్టలతో పుస్తకాలు.
అట్టలు లేని పుస్తకాలు.
అరిచేతిలోపట్టే పుస్తకాలు.
బాసిపట్టువేసుక్కూర్చుని, రెండు చేతులు జాపిపట్టుకున్నా బరువాపలేని పుస్తకాలు.
పొట్టి పుస్తకాలు.
పొడుగాటి పుస్తకాలు.
సన్నటి పుస్తకాలు.
లావాటి పుస్తకాలు.
తెలుగులో పుస్తకాలు.
ఇంగ్లిష్‌లో పుస్తకాలు.
శతకాలు.
ఎక్కాల పుస్తకాలు.
బాలశిక్ష.
చిన్న బాలశిక్ష.
పెద్ద బాలశిక్ష.
వినాయక వ్రత కల్పం.

నాన్నగారు ఏదన్న బయటి ఊరికి వెళ్తున్నారంటే పండగే.
వచ్చేటప్పుడు బోలెడు పుస్తకాలు తెచ్చేవారు.
అమ్మ బజారుకి వెళ్ళి వచ్చిందంటే చేతిలో ఎదో ఒక పుస్తకం లేకుండా వచ్చేది కాదు.
చెయ్యి జాస్తే పుస్తకం.
తలతిప్పితే పుస్తకం.

కధల పుస్తకాలు.
నవల పుస్తకాలు.
మీలో "పారిపోయిన బఠాణి" ఎంత మంది చదివారో?
నార్ల వారి "కీలుబొమ్మ"?
బుజ్జాయి, "పాతబంగళ" బొమ్మల కధ పుస్తకం.
"బుడుగు" లాగే మన తెలుగు వారికి ఇంకొక "భడవ" ఉన్నాడు?
ఎవరో చెప్పుకోండి?
"తిమురు అతని దళం" వ్రాసిందెవరు?
"చుక్కు" సోదరుడేవరు?
పాటల పుస్తకాలు, గీతాలు, బొమ్మలువెయ్యడం ఎలా?
"స్పుట్నిక్" ఇంట్లోకి వచ్చి వాలేది.

అబ్బో,ఎన్ని పుస్తకాలో?
ఇన్ని పుస్తకాలున్న స్వంత గ్రంధాలయం ఒదులుకుని మళ్ళీ ఇంకొక గ్రంధాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏది?

తరువాతి కాలంలో ఎప్పుడొ మొదటిసారి ఒక గ్రంధాలయానికి వెళ్ళాన సంగతి మరో టపాలో!"You made me my day,Mr. Kiran."
మీకు శతకోటి నెనర్లు!

***
ఈ వారం బ్లాగ్ విషయం - మీ దగ్గరలోని గ్రంథాలయాలు

మీరు మీ దగ్గరలోని గ్రంథాలయాల గురించి, వాటి లోని ప్రత్యేకమైన పుస్తకాల
గురించి, మీరు ఇంతకుముందు దర్శించిన గ్రంథాలయాల గురించి, పుస్తకాలు అమ్మే షాపుల
గురించి , పుస్తకాలు అద్దెకి ఇచ్చే షాపుల గురించి వ్రాయవచ్చు.
--
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

1 వ్యాఖ్య:

Post a Comment