విజయవాడలో ఒక గ్రంధాలయం

అలంకార్ సెంటర్లో తేనీరు సేవిద్దాం పద అంటు బయల్దేరదీసాడు ఒక మిత్రుడు. టీ కొట్టు పక్కనే ఒక బడ్డి. పత్రికలన్ని తోరణం లాగ కట్టి వేలాడ దీసిఉన్నవి.

సినిమా పత్రికలు చిత్రజ్యోతి, జ్యోతిచిత్ర, సితార, సినీ ఒం హెరాల్డ్, కాగడ, విజయచిత్ర, ఫిల్మ్ ఫేర్, స్టార్‌డస్ట్ వగైరాల. ప్రతివాడు వస్తున్నాడు. చూస్తున్నాడు. వాడితోబాటు ఒకళ్ళొ ఇద్దరో. ఒకే పత్రిక రెండు మూడు కాపీలు. చదువుతున్నారు. బడ్డి యజమానికి డబ్బు‌లిస్తున్నారు. వెళ్ళిపోతున్నారు. చదివిన పత్రిక అతనికే ఇస్తున్నారు. వారు తీసుకెళ్ళడం లేదు. అవేమి బూతు పత్రికలు కాదు. కొనుక్కున్నవి తీసుకెళ్ళవచ్చు కదా. ఎందుకని తీసుకెళ్ళడంలేదు? అ సందేహాన్ని గ్రహించిన మిత్రుడి వివరణ తో విస్తుబోవ్వాల్సివచ్చింది.

వచ్చినవారు పత్రికని కొనుక్కోవడం లేదు. చదివిన పేజికింత అని అద్దె కడుతున్నారు. ఒకే పేజిని ఇద్దరు ముగ్గురు చదువుకుంటే వారందరు ఆ అద్దేని పంచుకుంటున్నారు. తెలుగు పత్రికలకి అద్దే ఎక్కువ. వాటిల్లో సినిమా పత్రికలకు ఇంకా ఎక్కువ.

హైదరాబాదులో ఒక ప్రముఖ తెలుగు పుస్తకాల దుకాణంలో, తమ దగ్గిరున్న "తెలుగు" పుస్తకాలని "జెరాక్ష్" చేసి ఇవ్వడం చూసి ఈ బ్లాగరు నిర్ఘాంత పోవడమైనది.

అందుకనేనెమో తెలుగు పుస్తకాలు అమ్ముడవ్వడంలేదు. తెలుగు పత్రికలకు ఆడరణ లేదు.

0 వ్యాఖ్యలు:

Post a Comment