"రాత్రి ఆయన వల్ల పొరబాటు జరిగింది."





మగవాడు దున్నపోతా?
స్త్రీ అబల కాదు, సబలా?
మరి సబల ఐనప్పుడు ఈ ప్రకటన ఎంత వరకు సబబు?
సబల ఈ మాట అనగలుగుతుందా?
"రాత్రి ఆయన వల్ల పొరబాటు జరిగింది."
నిజమా?
పాపం ఆమెకేమి తెలియదా?
ఆమేకి ఏమి తెలియకుండానే జరిగిపోయిందా?
"బలాత్కారం" చేసాడా?
ఈవిడ నోట్లో వెలుబెడితే కొరకలేదు కాబోలు?
సుజాతలాగ, "“నాకు డైవోర్స్ కావాలి,” అని అడగొచ్చుగా?

మొన్న Times of Indiaలో రాసారులే.
ఆర్ధికంగా నిలదొక్కుకున్న స్త్రీలు విజృంభిస్తున్నారని.
ఆ విజృంభణ ఒక్క వీధుల్లోనే కాదు, పడక గదులలోను.
డబ్బున్న స్త్రీలలో శ్రంగారం విజృంభిస్తుందట.
డబ్బు వారికి "వయాగ్ర" (Viagra)అయ్యిందంట.
అబ్బే వారందరు ఆటువంటివారు కాదా?

లేదు తులశమ్మలాంటి వారా?
మరి ఐతే ఆ "చాకిరి"ని భరించాలి.
Unwanted - 72 కాకపొతే, i-pill మింగాలి.

స్త్రీలందరు మంచివారు.
పురుషలందరు "సెక్స్" పిచ్చగాళ్ళు.
ఈ మగాళ్ళకి "ప్రేమ" కి "కామం" కి మధ్య ఉన్న తేడా తెలియదు.
స్త్రీలకు కోరికలుండవా, ఉద్రేకాలుండవా?
వాళ్ళేవరిని రెచ్చగొట్టరా?
మొగవెధవేనా తప్పులు, తప్పుడు పనులు చేసేది?
అందుకనేనా, "రాత్రి ఆయనవల్ల పొరబాటు జరిగింది"?

ఈ ఆడపిల్లలని కని పారేసే "తల్లి" కి ఎటువంటి బాధ్యత లేదా?

నేటి ఈనాడు మొదటిపేజిలోని ప్రకటన చదివిన తరువాత--------------------------->
కాలాస్త్రి - ప్రేమ - ఉన్మాదం" లో "చర్చ" ఫలితం




15 వ్యాఖ్యలు:

Srinivas on April 15, 2008 at 11:36 AM   said...

చాలా ఊహించుకుని అనవసరంగా ఉద్రేకపడుతున్నట్టున్నారు. ఆయన వల్ల పొరపాటు జరిగిందంటే కండోం వాడవలసిన భర్త అది మరిచాడేమో! అంతకుమించి ఏ ఆరోపణా కనపడ్డంలేదు నాకయితే!

Anonymous on April 15, 2008 at 4:35 PM   said...

Srinivas: భర్త మరిస్తే ఈ సబల ఏం చేసింది?
అసలు విషయం అది కాదు.
ఆలోచించండి.

రాధిక on April 15, 2008 at 6:30 PM   said...

ఆ ఏడ్ క్రియేటివ్ హెడ్ మగాడయివుంటాడు.అతను అలా రాస్తే ఈమె ఏమి చెయ్యగలదండి?

సుజాత వేల్పూరి on April 15, 2008 at 10:43 PM   said...

అవును, ' ఆయన వల్ల ' అనేది తొలగించవలసిన మాటే! పొరపాటు జరిగిందనే మాట వాస్తవమైతే, ఇద్దరికి భాగం ఉందని ఒప్పొకోవాల్సిందే!

జ్యోతి on April 16, 2008 at 12:30 AM   said...

అసలు ఇది రాసినవాడికి తెలుగు సరిగ్గా వచ్చా అని. నాకూ తిక్కరేగింది. భార్యాభర్తల మధ్య "ఆయన వల్ల తప్పు జరిగింది" అనడం..అస్సలు చాలా యాడ్స్ అర్ధం పర్ధం లేకుండా పోతున్నాయి.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం on April 16, 2008 at 12:53 AM   said...

ఇందులో మనం ఆడ, మగ అని వర్గాలు చేసి ఆలోచించడం శుద్ధదండగ. వాళ్ళు ఏదో మాత్రలు అమ్ముకుని బతికేవాళ్ళు. వాళ్ళ బతుకంతే. వాళ్ళు అంతకంటే బాగా ఆలోచించలేరు. వాళ్ళ ఖర్మకి వాళ్ళని ఒదిలెయ్యండి.

Note :- దాంపత్యంలో పొరపాట్లేమీ ఉండవు. అదికాని చోటనే అన్ని పొరపాట్లూను. అర్థం కాదు, అంతరార్థం చూడాలి. ఆ పిల్సు ఖచ్చితంగా వివాహితుల విపణి (మార్కెట్) కోసం ఉద్దేశించినవి కావు.

Sujata M on April 16, 2008 at 1:35 AM   said...

తాడేపల్లి గారు.... చెప్పినది..100% కరక్ట్. I agree with him.

Anonymous on April 16, 2008 at 7:04 AM   said...

శ్రీనివాస్ గారి అభిప్రాయమే నాదీను.
తాడేపల్లి గారు చెప్పినది కూడా నిజమే. ఆ Note గురించి ప్రస్తుతం వ్యాఖ్యానించదల్చుకోలేదు.

నెటిజను గారూ, మీరు కొన్ని సార్లు వ్యాఖ్యలూ, టపాలు, చదివే వారిని పరీక్షించడం కోసం రాసినట్లనిపిస్తుంటుంది నాకు. ఉదాహరణకి మీరు ఇంటి గురించి ఒక టపా రాశారు....

అయితే, స్త్రీ పురుష సంబంధాలు, స్త్రీల గురించిన అభిప్రాయాలలో మటుకు మీరు నిర్మొహమాటంగానే మీ అభిప్రాయం చెప్తున్నట్లు అనిపిస్తోంది.

ఇప్పుడు చూడండి, ఎవరైనా, ఒక లెంపకాయ ఇచ్చి, ఇదెందుకో తెలుసా, "నిన్న నువ్వు నన్ను కొట్టావు, కలలో!" అన్నట్లు ఉంది ఈ ప్రకటనకి మీ స్పందన.

అది ప్రకటన. ఆ మాత్ర తయారు చేసే వారికి అది అమ్ముడు పోవాలి. అవి ఎటువంటి వారికి అవసరం అవుతాయి అని ఎవరికి కావలిసినట్టు వారు ఊహించుకోవచ్చు. అయితే ఈ చర్చలో పాల్గొనే వారెవ్వరికీ ఆ అవసరం లేదని కూడా బహుశా నమ్మవచ్చు.

నేను కాలాస్త్రి గారి బ్లాగులో చెప్పదల్చుకున్నది మరొక్క సారి చెప్పే ప్రయత్నం చేస్తాను.

స్త్రీ పురుష సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండడం అనేది సమాజ శ్రేయస్సుకు తప్పని సరి. అనారోగ్యకరంగా ఉంటే అది ఆడా, మగా ఇద్దరికీ నష్టం. సమాజం సంగతి సరే సరి. గర్భం ఒక్కటే కాదు ఫలితం. ఎన్నో రకాల వ్యాధులు మొదలయ్యి ప్రబలడానికి కారణం అనారోగ్యకర ప్రవర్తన. ఈ మాత్రల వంటివి ఆడ, మగా ఇద్దరికీ సురక్షితంగా ఉండవచ్చు ఏం చేసినా అనే పొరపాటు అభిప్రాయం కలగజేస్తాయి. ఇవి ఒక్క గర్భం నుంచే రక్షణ కల్పిస్తాయి, వ్యాధులు, మానసికమైన భంగపాట్లు నుండి కాదు.

ఆడవారిని కట్టు దిట్టం చేసేస్తే లోకంలో ఇంక సమస్యలే ఉండవు కదా అన్నట్లుంటాయి కొందరి వాదనలు. నిజంగా దఅదే నిజమైతే, సరే అలాగే చేద్దాం పదండి. ఈ చర్చలో పాల్గొనే వారిలో, వారి కుటుంబాలలో ఎవరీనా అసభ్యకరంగా తయారయ్యే వారున్నారంటారా? మరి కొందరు ఆ విషయానికి ప్రాధాన్యం లేదు జరిగే ఘోరాలలో అని ఎందుకంటున్నారు? వారిని వారు సమర్థించుకోవడానికైతే కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

వస్త్ర ధారణ గురించి ఎందుకు చర్చ జరిగింది, టపా దాని గురించి కాకపోయినా? అది మళ్ళీ మళ్ళీ నొక్కి వక్కాణించి ఎందుకు చెప్పాలనిపించింది? అలాగే మగవారు సమయమనం పాటించడం, తమలో కలిగే భావోద్వేగాలను తెలుసుకుని, నియంత్రించుకుని మెలగడం ముఖ్యం అని చెప్తే, దాని మీద కూడా ధ్యాస పెట్టాల్ని కాస్త గుర్తు చేస్తే, అది ఆడ వారు ఎలాగైనా బట్టలు వేసుకోవచ్చని చెప్పడం ఎలా అయ్యింది?

ఏం సాధించదల్చుకుంటున్నాం మనం? ఎందుకు మగ వారికి నీతులు చెప్పనివ్వం? ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల అవసరమైన భద్రతా విషయాలు, మానవ సంబంధ విలువలు తెలియక మగ వారు వారికి గర్భం రాదన్న ఒక్క ధీమాతో జాగ్రత్తగా, సంస్కారంగా ఉండనవసరం లేదనుకుంటున్నారు, అందరూ ఆరోగ్యం విలువ, స్త్రీపురుష సంబంధాల ఆరోగ్యం గురించి ప్రయోజనకరంగా చర్చిద్దాము అంటే అది ఎందుకు సాధ్యం కాదు?

ఇక్కడ నిజంగా మగ వారంటే care లేనిది ఎవరికి?

భర్త తాగొద్దు అంటే అది తనకి సుఖం లేదనేనా, లేక అతని ఆరోగ్యం గురించిన ఆలోచనతో కూడాఅనా?

ఎందుకీ విభజన? ఆరోగ్యకరమైన చర్చకు ఆహ్వానం పలుకుదాం.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం on April 17, 2008 at 2:18 AM   said...

"ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల అవసరమైన భద్రతా విషయాలు, మానవ సంబంధ విలువలు తెలియక మగ వారు వారికి గర్భం రాదన్న ఒక్క ధీమాతో జాగ్రత్తగా, సంస్కారంగా ఉండనవసరం లేదనుకుంటున్నారు"

లలితగారూ,

ఎవరన్నారా మాట ? ఎవరు చెప్పారు మీకు ? మగవాళ్ళవెరూ నీతులు చెప్పట్లేదని ? ఇంట్లో ఉండి తండ్రులు ఏం చేస్తున్నారని మీ ఉద్దేశం ? కొంతమంది మగవాళ్ళ వైఖరిని యావన్ మగజాతికీ అన్వయించబూనుకోవడం సమంజసమేనా ? గర్భం రాదన్న ధీమా వల్ల మగవాళ్ళు సంస్కారహీనులైతే, గర్భం రాకుండా ఆడవాళ్ళు అవలంబిస్తున్నది సంస్కారాన్నా ? జాగ్రత్తనా ? వాళ్ళకి ఇతరులు బోధిస్తున్నది సంస్కారాన్నా ? జాగ్రత్తనా ?

ఒకవేళ మీరన్నమాట మీద మీకంత నమ్మకం ఉంటే ఒక విషయం. ప్రతి సంస్కారహీనుడైన మగవాడికీ కంపెనీ ఇచ్చే ఇంకో సంస్కారహీనురాలైన ఆడది ఉంటుంది. కాదనగలరా ? మఱి మీరు మగవాళ్ళనే ఎందుకు ఆడిపోసుకుంటున్నారు ?

ఇలాంటి మాత్రల వల్ల ఆడవాళ్ళకి నీతిబోధలు వినాల్సిన అవసరం లేకుండా పోవడం నిజమైతే అది మీరు ఆడిపోసుకుంటున్న మగవాళ్ళ కేటగరీ విషయంలో రెట్టింపు నిజం. ఇలాంటి మాత్రలు ఆడవాళ్ళక్కాదు మేలుచేసేది, అంతిమంగా మగవాళ్ళకే.

స్త్రీశరీరం గతంలో ఎక్కడపడితే అక్కడ దొరికేది కాదు. దానికో పవిత్రత ఉండేది. ఇప్పుడదేదీ లేదు. అంగీకరిస్తారా ?

Anonymous on April 17, 2008 at 9:22 AM   said...

తాడేపల్లి గారు,
మీరు నా వేద ఘోషకు కూడ నేను "వేదాలు చదవద్దు" అని నేను అన్నట్టు వ్యాఖ్య చేశారు.
నేనక్కడ చెప్పింది అందరమూ చదివి తేల్చుకుందాం నిజంగా ఏం చెప్తున్నాయో అని.

అలాగే ఇప్పుడూ "ఇలాంటి మాత్రలు ఆడవాళ్ళక్కాదు మేలుచేసేది, అంతిమంగా మగవాళ్ళకే." అన్నదే నా మాట కూడాను. అయితే ఆ "మేలు" percieved మేలు. నిజానికి character నష్టపోవడానికి ఉపయోగపడేది మేలు కాదు అని మీరూ ఒప్పుకుంటారనుకుంటాను.
నా వ్యాఖ్య నుంచి కొన్ని మళ్ళీ quote చేస్తున్నాను. నా భావం ఈ సారి సరిగా అర్థం అవుతుందని భావిస్తున్నాను.

" ఈ మాత్రల వంటివి ఆడ, మగా ఇద్దరికీ సురక్షితంగా ఉండవచ్చు ఏం చేసినా అనే పొరపాటు అభిప్రాయం కలగజేస్తాయి."
"ఇవి ఒక్క గర్భం నుంచే రక్షణ కల్పిస్తాయి, వ్యాధులు, మానసికమైన భంగపాట్లు నుండి కాదు. "

"ఈ చర్చలో పాల్గొనే వారిలో, వారి కుటుంబాలలో ఎవరీనా అసభ్యకరంగా తయారయ్యే వారున్నారంటారా? మరి కొందరు ఆ విషయానికి ప్రాధాన్యం లేదు జరిగే ఘోరాలలో అని ఎందుకంటున్నారు? వారిని వారు సమర్థించుకోవడానికైతే కాదు. "
ఈ వాదనలో వస్త్రధారణ ఒక్కటే కాదు సమస్య అన్న వారందరూ తమని తాము సమర్థించుకునేందుకు కాదు ఆ మాటలు అంటున్నది, ఇంకో కోణం మీద కూడా వెలుగు ప్రసరింప చేయడమే వారి ఉద్దేశం, ఆ కోణాన్ని కూడా చర్చిద్దాం అని.
ఇక మీ లాంటి తండ్రులు అబ్బాయిలకి విలువలు నేర్పించటం లేదని నేననడం లేదు.
At the same time, నాకనిపిస్తోంది, ఇలా రాస్తుంటే, అబ్బాయిలకు నాలుగు గోడల మధ్యాను, అమ్మాయిలకు ఇలా బహిరంగంగానూ పాఠాలు చెప్పడం ఏమిటీ అన్న సందేహం కూడా వచ్చింది.

సరె, అసలు సంగతి:
నా స్పందన వెనుక ఉన్న ఆలోచనలను రాస్తాను.
0. నేను స్త్రీవాదిని కాను, నాకు స్త్రీవాదం నిర్వచనం కూడా సరిగ్గా తెలీదు. అది తప్పో, రైటో కూడా వాదించగలిగే పరిజ్ఞానం నాకు లేదు.
1. ఈ జరిగిన సంఘటనలో వారికీ, ఇక్కడా చర్చించే వారికీ ఏ కుటుంబ సంబంధాలూ లేవనుకుంటున్నాను.
2. ఇక్కడ చర్చించే వారెవ్వరూ నాకు వ్యక్తిగతంగా తెలియదు.
3. AIDS గురించి media లో చూడగా, చూడగా, చదవగా చదవగా నాకున్న కొన్ని అపోహలు తొలిగాయి. అవి ఏంటంటే, తాడేపల్లి గారన్నట్టు నిష్పత్తి నేరంలో 1:1 కానే కాదు. సామూహిక అత్యాచారాలు, ఇంకా కొన్ని అక్రమ వ్యాపారాలు మాత్రమే చూసుకున్నా ఈ విషయం స్పష్టం అవుతుంది.
4. ఇప్పుడు మనం చర్చించేసి మనలో ఎవరో ఒకరు చివరి మాట చెప్పినంత మాత్రాన ఆనేరంలో చనిపోయిన వారు బ్రతికి రారు. వచ్చి వారు రెచ్చగొట్టినందుకు క్షమాపణ చెప్పుకోలేరు.
5. సామాజిక అర్థిక పరిస్థితుల వల్ల లారీలు నడిపే వారు, కూలీ నాలీ చేసుకునే వారు, మాస్ సినిమాలు చూసి రెచ్చిపోయి, తాగి వళ్ళు మర్చిపోయి డబ్బులిచ్చి సుఖాన్ని కొనుక్కున్న ఉదంతాలు వారి నోటితోనే AIDS బారిన పడ్డాక చెప్పిన కథనాలను చూసి, అటువంటి వారి భార్యలు, బిడ్డలు (బిడ్డ ఆడ కావచ్చు, మగ కావచ్చు) కూడా ఆ వ్యాధి బారిన పడి అనుభవించే క్షోభ నన్ను అలోచింపచేసి నా అభిప్రాయాల్ను వ్యక్తం చేసేలా చేస్తుంది.
6. ఒక స్త్రీకి AIDS వస్తే ఆమెని ఎంత హీనంగా చూదవచ్చో, ఎంత సులభంగా తప్పు పట్టి ఆమె ప్రవర్తన గురించి ఊహా గానాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది రక్త మార్పిడి వల్ల జరిగిందా, తిరిగొచ్చిన భర్త వల్ల అంటిందా అన్న ప్రశ్నకు కూడా తావివ్వండి అని ఆలోచించాలి కూడా అని విన్నపం.
7. అబ్బాయికి లక్ష చెప్పండి సమాజంలో ఆడ వారిని నీచంగా చూసినంత కాలం, తప్పు ఎవరు చేసినా, ఆఖరికి ఆమె చచ్చిపోయినా, ఆమె వంతు ఆ తప్పులో ఎంత అని వాదించే వారున్నంత కాలం మనం మగ వారికి నేర్పే పాఠం ఒక్కటే, అది, నీ character, నీ జీవితం మాకు ముఖ్యం కాదు అని.
8. ఇక తాడేపల్లి గారూ, మీరు చివర్న అడిగిన ప్రశ్న ఎంత అసభ్యకరంగా ఉందంటే, దానికి జవాబు చెప్పడానికి నా దగ్గర ఇప్పుడూ ఉపకరణాలు లేవు.

ఇక ఇది నేను దుమారం లేపాను అనో, వక్రీకరించాననో, లేక ఇంకేదనో అనుకునే వారికీ, అనే వారికి అది బహుశా నా comuunication skills లో లోపమేమో అని తప్ప ఇంకే జవాబూ చెప్పలేను. నన్ను వదిలెయ్యండి. విషయాన్ని గురించి ఆలోచించండి.

Anonymous on April 17, 2008 at 9:24 PM   said...

అసభ్య పదజాలంతో ఉన్న వ్యాఖ్యలు నిర్ద్వందంగా నిరాకరించబడతాయి!

Dr. Ram$ on April 19, 2008 at 9:37 AM   said...

ముందు గా టపా రచయిత కి నాది ఒక ప్రశ్న.. మీకు పెళ్ళైందా?? పెళ్ళి కి ,బార్య కి,ప్రేమ కి ,సెక్స్ కి, పిల్లల కి ఏమన్నా అవినావభావ సంబంధము చూశారా??

పైన చెప్పబడిన "మాత్రలు" కేవలము గర్భ నిరోధక మాత్రలు మాత్రమే కదా..!! అవి ఎందుకు వాడతారు?? ఎమెర్జెన్సి కాంట్రసెప్టివ్స్ అంటే తెలుసా?? మీ టపా లో మీరు చెప్పిన సబల, ఆయన వలన రోజు పొరపాటు జరుగుతుంది అని చెప్పిందా?? అసల ఆ సబల కి గర్భ నిరోధక మాత్రల అవసరము ఎందుకు వచ్హింది?? పిల్లలు వద్దు అనుకుంటేనే కదా!! మరి అలాంటప్పుడు పొరబాటు ఎవరి వలన జరుగుతుంది..ఆ సబల వలననే పొరబాటు జరిగితే తను మాత్రలు ఎందుకు వేసుకుంటుంది?? భర్త కండోమ్ వాడటము లేదు అని విడాకులు ఇవ్వోచ్హా?? ఈ టపా లో చాలా మంది వ్యాఖ్యలు చూశాను..కొందరు పెళ్లైన వాళ్ళు కూడా వున్నారు.. వారు మరి టపా ని, మీరు వ్యక్త పరిచిన భావాన్ని పూర్తిగా అర్ధము చేసుకొని వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు.. అసల గర్భ నిరోధక మాత్రల కి , స్త్రీ సబల శక్తికి, స్త్రీ వస్తధారణ కి, సెక్స్ లో విజృంభిన్చడానికి పోలిక కలిపి టపా.. 100% గర్భ నిరోధక తప్పిదాలు, మగ వారి వలననే జరుగుతాయి.. 100 కి 53% గర్భ నిరోధక తప్పిదాల వలననే గర్భాలు (Un planned pregs) వస్తాయి.. అంటే పొరబాటు యెవరి వలన జరిగి వుండొచ్హంటారు?? సరే స్త్రీ అబల కాదు, సబల నే అనుకొని విడాకులు కోరుకుంటే ఎంతమంది విడాకులు తీసుకోవాలో తెలుసా మరి?? గర్భ నిరోధక మాత్రల కి , స్త్రీ శక్తి మీరు పెట్టిన పోలిక అతి చిత్రాతి విచిత్రము..
మీరు స్త్రీ ని ద్వేషించండి మీకు నచ్హకపోతే, తప్పు లేదు...కాని కొంచెము పరిపక్వత చూపించండి.. మీరుచ ెప్పిన ఆ తుళిశమ్మ కథ నేను ఈనాడు ఆదివారము లో ఆ రోజే చదివాను..కాకపోతే రచయిత కాస్త మరీ ఎక్కువ గా చేసి చూపించిన, నిజము చెప్పాలి అంటే మన పల్లెల్లో, చాలా మంది ఇళ్ళల్లో ఇప్పటకి అది జరుగుతూనే వుంటుంది..అదేమి అతిశయోక్తి కాదు.. మీరు ఏమి మరీ సంబ్రమాశ్చార్యాలకి గురి కావాలిసిన పని లేదు..
కాని మీ టపా లో ని భావాన్ని ఇంకో విధము గా చెప్పగలను, స్త్రీ, పురుషుడు, సెక్స్ ఈ మూడింటీమ ద్య ఒక అవినావభావ సంబంధము వుంటుంది..అదేమిటంటే, స్త్రీ అలోచనలు ఎప్పుడు , ఎలా వుంటాయి అంటే, పురుషుడి ని లొంగ దీసుకొని తనకు నచ్హిన పని చేసుకోవాలి అంటే, అది కేవలము సెక్స్ ద్వారా మాత్రమె సాద్యమవుతుంది అని..అందుకే, ఈ సరసాలు, సయ్యాటలు, అలకలు, కలహాలు...మన సమాజము కాని, మన శరీరము లో ని హార్మోనులు కాని, అవి కూడా అలానే ట్యూన్ అయ్యి వుంటాయి..యిది జగమెరిగిన సత్యము.. దీన్ని ఖండించే నాధుడు, నాధురాలు కూడా యెవరు వుండరు..

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం on April 19, 2008 at 7:28 PM   said...

లలితగారూ !

స్త్రేలమీద మీకున్న గౌరవం అపారం. Woman can make no mistake. ఆడవాళ్ళు ఈ లోకంలో పుట్టాల్సినవాళ్ళు కారు. వాళ్ళు చాలా స్పెషల్. వాళ్ళు angels. అదే సమయంలో మగవాళ్ళు ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్ని చండాలాలకీ కారకులు. వాళ్ళు లేకపోతే ప్రపంచం బాగుపడుతుంది. వాళ్ళు మీ favourite whipping boys. వాళ్ళంతా black sheep.

కాబట్టి మీ వెర్షన్ లో వ్యభిచారం మగవాళ్ళకు పరిమితమైన అంశం. ఇందులో ఆడవాళ్ళకు ఏ జోక్యమూ పాత్రా లేవు. వ్యభిచరించినా ఆడది మగవాడంత వ్యభిచరించదు. కదూ ? ఆడది లేకుండా మగవాడెలా వ్యభిచరిస్తాడనే simple fact ని ignore చేసే స్థాయికొచ్చింది మీ స్త్రీజాత్యభిమానం.

మీరు ఎయిడ్స్ ప్రస్తావన తెచ్చారు. అది ఇక్కడ ప్రాస్తావికం కాకపోయినా ! మగవాళ్ళు బయట తిరిగి ఇంట్లో ఆడవాళ్ళకి ఎయిడ్స్ అంటిస్తున్నారని మీ వాదన. మఱి ఆడవాళ్ళు బయట తిరగడంలేదా ? చాలా ఎక్కువ తిరుగుతున్నారు. మీ సర్కిల్ లో ఆడవాళ్ళు మంచివాళ్ళైనంతమాత్రాన ప్రపంచంలో ఆడవాళ్ళంతా అంతే అనుకోకండి. లేదా ఒకళ్ళిద్దరు చెడ్డమగవాళ్ళు కనిపించినంతమాత్రాన ప్రపంచంలో మగవాళ్ళంతా దుర్మార్గులని ప్రచారం చెయ్యకండి. మంచీ చెడూ అందరిలోనూ ఉన్నాయి.

చెప్పొచ్చేదేంటంటే - చంద్రబాబునాయుడుగారి హయాములో ఎయిడ్స్ గుఱించి చేసిన ఒక శాంపుల్ సర్వేలో బయటపడ్డ విషయం - అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి 8 శాతం మంది (సుమారు 30 లక్షలమంది)ఆడవాళ్ళకు భర్తతో కాకుండా పరాయిపురుషులతో కూడా రెగ్యులర్ సంబంధాలున్నాయని ! ఇప్పుడు చెప్పండి - ఎవరు ఎవరికి ఎయిడ్స్ అంటిస్తున్నారు ?

Anonymous on April 20, 2008 at 12:57 PM   said...

This is yet another time I forgot, "విభూషణం మౌనమపణ్డితానాం" and dared comment.
My apologies.

Post a Comment