బాశ విచిథ్రంగా వుందంట!

ఒక కొడవటిగంటి కుటుంబరావు, ఒక ఆరుద్ర, ఒక ఆత్రేయ, ఒక పిలకా గణపతి శాస్త్రి, ఒక రామలక్షి, ఒక మాలతీ చందూర్, ఒక సరోజిని ప్రేంచంద్, ఒక వావిళ్ళ, ఒక విద్వాన్ విశ్వం, ఒక శ్రీ శ్రీ, ఒక పాలగుమ్మి పద్మరాజు, ఒక దాసు వామన రావు, ఒక రాధాకృష్ణమూర్త్రి, ఒక భారతి, ఒక ఆంధ్రప్రభ, ఒక జ్యోతి, ఒక ఎస్. పి, ఒక ఘంటశాల, అందరూ నేటి చెన్నయిలో జీవించిన వారే. ఇడ్లీ సాంబారుతో పాటు, అవకాయలో పప్పు నంజుకుతిన్నవారే! వారి జీవితకాలంలో ఎన్నో వసంతాలను మెరినా బీచిలో సుండల్ తింటూ, ఫిల్టర్ కాఫీని స్టీలు గ్లాసులో ఆర్చుకుంటూ తాగినవారే!  వారందరూ తెలుగు భాషని తమ శక్తిమేరకు ఉన్నత శిఖరాలధిరోహించడానికి సేవ చేసిన వారు, చేస్తున్నవారు.

ఎప్పుడో, ఎక్కడో తమిళ నాట అది!

మనం ఇప్పుడు ఉంటున్నది, రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో..ఎనిమిది కోట్ల తెలుగు వారు.  ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రలో కూడా తెలుగులో కలలు కనే అవకాశం ఉన్న రోజులివి.
మరి మనకెందుకీ మాయదారి రోగం వచ్చింది?4 వ్యాఖ్యలు:

Vamsi M Maganti on June 7, 2010 at 1:50 AM   said...

బాశ విచిద్రంగా వుందా. హయ్యో నాగిప్పటరకు తెల్వదే. పత్తాబిరాం చెప్పినాడు కదా మల్లి మల్లి - సూపర్గుంది.

కత్తి మహేష్ కుమార్ on June 7, 2010 at 2:46 AM   said...

ప్రశ్న "కేక".సమాధానం కేకో... కేక !
హహహ

సుజాత on July 27, 2010 at 2:14 AM   said...

ఇదో పాలి సూడండి!

http://manishi-manasulomaata.blogspot.com/2009/10/blog-post_19.html

netizen నెటిజన్ on July 28, 2010 at 8:00 AM   said...

@వంశి: :)
@ మహేష్‌ కుమార్: మన దౌర్భాగ్యం కాకపోతే మరేమిటి ఇది?!
@ సుజాత: ఆ మధ్య ఒక ప్రధాన సంపాదకుడికతో మీ టపాలోని కొన్ని అంశాలగురించి చర్చిస్తే..నవ్వుతూ లైట్‌గా తీసుకోవాలి అని అన్నారు. స్ట్రింగర్‌లని ప్రకటనలకోసం తిప్పడం మొదలైనప్పుడు, ‌'పెయిడ్ న్యూస్‌' తో సర్ల్యులేషన్ పెంచుకోవడం మొదలైనఫ్ఫుడు ‌'డొక్కశుద్ధి‌' లేని అడ్డమైన గాడిదలు, "స్పందన" ల కోసం, పాఠకులు, వీక్షకులు మెడియా ఇచ్చే ‌'ఇన్‌స్టంట్ కిక్‌' ల కోసం చూస్తున్నప్పుడు మనం ఇంతకంటే ఆశించడం తప్పేనని ఊరుకుంటే అది ఇక్కడి తో ఆగదు. మన భాష దాంతో పాటు మన సంస్కృతి చచ్చి పోతాయి! మనమందరం మనకి అవకాశం దొరికినప్పుడల్లా గళమెత్తాలి!
మీ పాప ‌'సంకీ‌ర్తన' తెలుగు ఎంత వరకు వచ్చింది? మీ లాంటి భాషాభిమానులున్నంత కాలం మన పిల్లలు తెలుగుని మర్చిపోరు! మీ పాపకి ఆశిస్సులతో..

Post a Comment