నా ప్రాపర్టీ, నా రైట్ కదా ?

ఏప్పటి మాట.ఇది 2010 కదా!
దాదాపు ఒక సంవత్సరం, అటూ ఇటూగా, టూ కే లో.

ఫ్రెంచ్‌వారి కాంకర్డ్స్, ఆకాశంలోనుంచి పిట్టలు లాగా రాలిపోతున్నయి.
గాట్ వచ్చేసింది.
యూరో త్రీ నాంస్ కూడ వచ్చేసినవి.
అమెరికాలో మైక్రొసాఫ్ట్ - గేట్స్ మీద కేస్.
ఒకవైపు విండోస్..మరొవైపు’ లినెక్స్!
“నాప్‌స్టర్ ప్రిన్స్" ఇటువైపైతే ‘అమెరికా మ్యూజిక్ రీకార్డింగ్" కంపెనిస్ అటువైపు.
ఇక్కడ అంధ్రాలో చంద్రబాబు నాయుడు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్స్.
మొన్న కర్నాటకలో కన్నడ కంఠీరవుని కిడ్నాప్ - విడుదల.
నిన్న, వీరప్పన్ నాగప్ప హత్య!

చెన్నైలో ఉన్నాను. మద్రాసులో, కాదు.

ఈ రోజు ఉదయమే సింగపూరులో ‘టెక్సాస్’ వారితో మీటింగ్. సాటర్‌డే రిలీజ్ అయ్యే నా డాట్కాం పబ్లిక్ ఇస్శ్యు, రిలేజ్ అండ్ జేవీ గురించి. రావు గారు వచ్చారు నన్ను సింగపూర్ ఏర్‌పోర్ట్‌లొ డ్రాప్ చెయ్యడానికి.

"బ్లేజ్‌వాడా" లో ఉన్న మా అవిడకి, మా బంగారు పాపకి ఏమైనా కొందామని టీ నగర్లో దిగాను. పాండి బజార్‌లో రెండు బంగారు నాణేలు కొన్నాను. క్రోకడైల్ ట్రౌజర్ ఒకటి మా సుపుత్రుడికి తీసుకున్నాను. పానగల్లు రాజవారి పార్క్ వైపు కదిలాయి కాళ్ళు.

తెలుగు కనబడితే నాకు తెగులు.అందుకని ఒక స్వాతి, విపుల చతుర, ప్రభ "ఇంటర్‌సిటిలో" చదువుకొవడానికి కొనుక్కున్నాను.

అసలు పాంటాప్‌లోకి డౌన్లోడ్ చేసుకుంటే పొయ్యేది, స్టిఫేన్ కింగ్ నవలని! ఏమైనా..పేపర్ మీద ప్రింటైన పుస్తకం, పుస్తకం కదా?!

పానగల్లు రాజావారి పార్కుకి ఏదురుగుండా, ఆ మూలమీద ‘పబ్’. అప్పటికే సదర్న్ సిలికాన్‌వాలి బెంగళురులో ‘డ్రై’ పబ్స్ ఉన్నాయి. రాందాసు పుణ్యామా అంటు పబ్లిక్ స్మోకింగ్ బాన్ చేసారు. పబ్స్‌లో స్మోకింగ్ అలవుడ్. బయట హాకర్ వున్నాడు. వాడి దగ్గిర హాట్‌బాక్స్‌లో సమోసాలు. ఏమిటో నూనె ఒడుతున్న సమోసాలు. నుజ్జు నుజ్జు ఐన "సుండల్". కాని ‘దం’ టీ సువాసన బావుంది.

సిగరెట్టు అంటించుకోవడానికి ‘అగ్గి’ అడిగాడతను. అప్పుడు గమనించాను అతన్ని. తాగి ఉన్నాడు. బీరు వాసన. కడుపులో తెములుతున్నది.
అప్పుడు వచ్చింది ఆలోచన.
అరే, ఇక్కడ ‘అగ్గి’ అమ్ముకొవచ్చు.
టీ త్ర్రాగే పది నిముషాలలొ ఎంత వచ్చినా, వచ్చినట్లే కదా?!

‘సరే, ఇస్తాను’.
‘ఎంత ఇస్తావు?’ అని అడిగాను.
‘పది పైసలు’, అని అన్నాడు అతను.
‘సరే’ అన్నాను.
"మరి లైసన్స్", గొణిగాడు అతను.
"ఫ్రీ..ఒక్కసారికి..నీకు మాత్రమే", ధర్మరాజు లెవల్లో పలికాను.

నేను అతనికి లైసన్స్ ఇచ్చింది, నా ‘అగ్గి’తొ అతని సిగరెట్టు అతను వెలిగించుకోవడానికి మాత్రమే. దానికి నా చార్జ్ అక్షరాల పది పైసలు మాత్రమే.ఆ చార్జ్, నా "అగ్గి"తొ అతను తన సిగరెట్టు అంటించుకొవడానికి మాత్రమే. నేను అతనికిచ్చిన లైసన్స్ ప్రకారం అతను నా "అగ్గి"తో ఇంకేమి, ఎవ్వరివి, ఏవి అంటించకూడదు. నా "అగ్గి" ఇంకొకరికి అరువు ఇవ్వకూడదు. ఇన్‌ఫాక్ట్ అది నా "అగ్గి". మళ్ళీ నాకు రిటణ్ చెయ్యాలి. వెంటనే. క్లియర్?

నాకర్ధమయ్యింది. నన్ను ‘పిచ్చివాడు’ అని అనుకుంటున్నాడు. "పాపం పిచ్చొడు"!, ఐనా ఒప్పుకున్నాడు అది నా "అగ్గి" అని, నేను అతనికి ఇచ్చింది, అతని సిగరెట్టు వెలిగించుకోవడానికని, అతనికి మాత్రమేనని, ఆ లైసెన్స్ ఆ ఒక్కసారికేనని.

రెండు క్షణలా తరువాత గమనించాను. అతని స్నేహితుడు ఆ త్రాగుబోతుని "అగ్గి" అడిగాడు. వీడు వాడికి, తను అంటించుకున్న సిగరెట్టు ఇచ్చాడు. నాకు కోపం వచ్చింది. నేను లైసెన్స్ ఇచ్చింది, వాడికి తన సిగరెట్టు అంటించుకునేందుకు మాత్రమే! వాడి స్నేహితుడైతే నాకేమిటి? మరొకడైతే ఏమిటి?

అతనివైపు దూకుడుగా వెళ్ళాను. ఏమిటీ ఇదంతా అంటూ. నేను అటు వెళ్ళేలోపు, త్రాగుబోతు స్నేహితుడు తన స్నేహితుడికి తను అంటించుకున్న సిగరెట్టు ఇచ్చాడు! వాడు ఇంకొకడికి ఇచ్చాడు.

మొత్తం "పబ్"లోని అందరి నోట్లో సిగరెట్ట్లు వెలుగుతున్నై. అందరూ నేను త్రాగుబోతుకి ఇచ్చిన "నా అగ్గి" తోనే సిగరెట్స్ అంటించుకుంటున్నారు.

నాకు పైసా ఇవ్వకుండా నా "అగ్గి" తో వాళ్ళందరు సిగరెట్స్ అంటించుకొవడానికి ఎంత ధైర్యం?

నాకు కోపం వచ్చింది. అవేశంతో దొరికినవాడిని దొరికినట్టు చితకబాదడానికి రెడీ అయ్యాను. మొదలుపెట్టను బాదడం.

నాకు ఇవ్వల్సిన "డబ్బు" ఇవ్వండి అని అరిచాను. వాళ్ళ నోట్లో సిగరెట్స్ లాగేసాను. కిందపడేసి నా షూస్‌తో నలిపి ఆర్పెయ్యడం మొదలుపెట్టాను!

నాకు ఈ రోజుకికూడా అర్ధంకావడంలేదు. ఆ "పబ్" బేరెర్స్ ఏందుకని నన్ను లాగి ఫుట్పాత్ మీదకి విసిరేసారు అని?

నా "అగ్గి" అది, దేరెఫోర్ అది నా ప్రాపర్టీ రైట్ కదా?!

మీకు అర్ధంఅయ్యిందా?!

3 వ్యాఖ్యలు:

Bhale Budugu on August 5, 2007 at 3:51 PM   said...

అగ్గి అనేది - మీరు ఒకరికి అంటించుకుందుకు ఇచ్చేంతమటుకే మీ అగ్గి - తరువాత అది దావాలనం,మీకు మిగిలేది బుగ్గి..కాబట్టి మీ అగ్గి మీ ఇంట్లోనే పెట్టుకోండి..ప్రాపర్టీ రైటు అంటే అందరూ కాలిపోవటమే..అర్ధమయ్యిందా

netizen నెటిజన్ on August 7, 2007 at 6:19 AM   said...

@budugu గారు bhale అర్ధమయ్యిందండి. :)

@కొత్తపాళ గారు థాంకులు!

Post a Comment