"ది హిందు" న్యూస్ కరెక్టా? ఈనాడు వార్త ఒప్పా?

Posted by netizen నెటిజన్ on Thursday, December 20, 2007
వార్తా ప్రసార మాధ్యమాలలో నేడు విపరీతమైన పోటి నెలకొనిఉంది.

నేనే ముందు అంటే కాదు నేను ముందు అంటు, నాది ఈ ప్రత్యేక కధనం అంటే కాదు నాది ఈ ప్రత్యేక కధనం అంటు కాట్లకుక్కలలాగా పోట్లాడుకున్నా, ప్రేక్షకుడు, చదువరి ఇద్దరు లాభపడుతున్నారా అన్నది ఇంకా ప్రశ్నార్ధకమే.

ఏ పత్రిక చూసిన అదే వార్త!
అవతలివాడి పత్రికకంటే ఇంకొంచెం మసాల ఘాటు ఎక్కువ చెయ్యడం, అది అవతలి వాడి వార్త ఐనా తమ వార్త క్రింద ప్రచురించుకోవడం సర్వ సాధరణం ఐపొతున్నది.

యాజమాన్యాల లాభాపేక్షకు సంపాదకులు కూడా తలలూపల్సిన పరిస్థితి, నేటి తెలుగు పత్రికా రంగంలో!

ఒకే వార్త. రెండు పత్రికల కధనం ఇక్కడ చూడండి.
"ది హిందు" వార్తలోని కొన్ని వాక్యాలను "హై లైట్" చెయ్యడం తప్ప ఇంకెటువంటి మార్పులు చెయ్యలేదు.

ఇక్కడ "The Hindu" వార్త.
దాని pdf ఫైల్.

ఇక్కడ "ఈనాడు" వార్త.
దాని pdf ఫైలు.

3 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli on December 20, 2007 at 10:38 AM   said...

అయ్యా మీరు పేర్కొన్న రెండు పత్రికల వారికీ అనేక ద్వైపాక్షిక ఒప్పందాలున్నాయి. ఆస్కీములోదేమో ఈవార్త???

netizen నెటిజన్ on December 20, 2007 at 10:13 PM   said...

అర్యా, మీరన్నది నిజమే!
"ది హిందు" అసలు ఆ బొమ్మని ప్రచురించాలా వద్దా అన్న ప్రశ్న వేసుకున్నారు. ఆ బొమ్మని ప్రచురించడం వలన తమ పాఠకులకు నష్టం కంటే లాభమే ఎక్కువ అని అనుకున్నారు. సందర్శకులు తగు జాగ్రత్తలు తీసుకోకపొతే ఏర్పడే దారుణ పరిణామాలను ఆ బొమ్మని చూసినవారికి అర్ధం అవుతుంది. వారికి కావల్సినది అంతే.

కాని, అక్కడ చిక్కని ఎర్రని రక్తం, విడిగా పడిపొయిన తెగిన భుజం, ఆ మృతుడి శవం,రక్తాన్ని జుర్రుకుంటున్న ఆ పులులు వర్ణ చిత్రాలు కావాలా?

"హైప్" అంటే ఇదే, మరి.
"ది హిందు" అంత హైప్ సృష్టించలేదేమి?

"రెండు పత్రికల వారికీ అనేక ద్వైపాక్షిక ఒప్పందాలున్నాయి. ఆస్కీములోదేమో ఈవార్త???"
నిజమే. మరి కాసులేనా? వారి ఆలోచన సరళిలో మంచిదేమన్నా ఉంటే అదికూడా గ్రహించి తమ పాఠకులకు పంచవచ్చు కదా?

ఉదా: మద్యపాన నిషేధ ఉద్యమానికి "ఈనాడు" ఇచ్చిన ఊపు మీకు తెలిసే ఉంటుంది. మరి ఆ యాజమాన్యానికి పాత్ర ఉన్న మీ "ఊళ్ళో" హోటల్లో అది "నిషేధం"లో లేదెందుకని?

నెటిజనిత

braahmii on December 21, 2007 at 2:56 AM   said...

రామోజీరావును బూదరాజు రాధాకృష్ణ ప్రచండ వాణిజ్యవేత్త అన్నాడు. (వ్యాపారాత్మక ప్రయోజనాల కోసం నీతి ముసుగులో ఏమయినా చెయ్యగల నైపుణ్యం ఉందని గుర్తించటం వల్ల కాబోసు.) "ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయని" మన్స్పూర్తిగా నమ్మి ఆచరించటం ఈనాడు నీతి. మీరు మార్గదర్శి లాంటి వ్యవహారాల్లో కూడా ఆ మార్గాన్ని దర్శించి తరించవచ్చు. ఇంక ఉదాహరించాలంటె మహా మంత్రనగరి చిత్ర నగరి (ఫిల్మ్ సిటీ) కూడా ఉంది. కానీ రంగంలోని అనేక పత్రికలకన్నా ప్రజలకు తక్కువ కీడు చేయటమే ఈనాడు విశిష్టత. మీరు ఇంకా చదవాలంటే http://bp2.blogger.com/_hjGXoHobZYc/Rh0U2UyS4II/AAAAAAAAANE/c9CVTeG7vIg/s1600-h/disc.gif లాంటివి చూడండి.
బాలవాక్కు

Post a Comment