మీరు అతిధులు కాదు!

Posted by netizen నెటిజన్ on Wednesday, January 2, 2008
మీకంటూ ఏవో అభిప్రాయాలు ఏర్పర్చుకున్నారు.
భావ ప్రకటనా స్వాతంత్రం ఉంది కాబట్టి వాటిని ప్రకటించారు.
కొందరు మీ భావాలతో ఏకిభవించలేదు.
మీ మీద దాడికి దిగారు.
మీరు ఎంచుకున్న పద్ధతి కాకుండా వ్యక్తిగతమైన దాడి అది.
అక్కడ మనలేకపొయ్యారు.

దేశాల సరిహద్దులు దాటారు.
సముద్రాలు దాటారు.

వారు మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు.
మీకు నిద్రపట్టకుండా చేస్తున్నారు.
మీ జీవితానికి భద్రత లేదు.

అటువంటి పరిస్థితులలో మీరు భారత దేశం చేరారు.
ఆ దేశంలో కూడ భావ ప్రకటన స్వేచ్హ ఉంది.
కాబట్టి నేను నా అభిప్రాయలను వెలువరిస్తాను అని అన్నారు.
ఆ దేశంలో - హైదరాబాదులో - మీ మీద దాడి జరిగింది.
అందరు చూస్తుండగానే.
కాని మిమ్మల్ని సాదరంగా అహ్వానించినవారే మిమ్మల్ని, మీ ప్రాణాలని రక్షించారు.
వారి మూలంగానే నేడు మీరు బ్రతికి బట్టకట్టి జీవిస్తున్నారు.

అతిధిగా వచ్చారు.
అతిధిగా ప్రవర్తిస్తే బావుంటుంది.

మీ ఇంటికి ఒక అతిధి వచ్చినప్పుడు, మీ ఆచారాన్ని, మీ సంప్రదాయన్ని, మీ సంస్కృతిని గౌరవించడం కనీసపు మర్యాద.

అలాగే అతిధి మంచి చెడ్డలు చూడడమన్నది ఆశ్రయమిచ్చిన వారి కర్తవ్యం.

మీరు ఆశ్రితులు.
అతిధులు కాదు.
అది గుర్తెరిగి ప్రవర్తించాలి.

లేదు, నాకు నా భావ ప్రకటన స్వేచ ఉంది, దానిని ఎవరు అడ్డుకోలేరు, నా గొంతుని ఎవరు నొక్కలేరు, నన్ను, నా అభిప్రాయాలను, నా ప్రాణాలను, కాపాడటం నాకు అశ్రయమిచ్చిన వారి బాధ్యతే అని మీరు నమ్మినట్టయితే, మీరు మరో చోటు చూసుకోవడం ఉత్తమం.

ఏమంటారు?

(
I am like the living dead - Taslima Nasreen చదివాక)

1 వ్యాఖ్య:

Anonymous on January 3, 2008 at 2:54 AM   said...

అమ్మకాలు పెరగాలంటే ఎలా? నేను లజ్జ చదివాను కాని దానికి మనం ఎందుకంత తీవ్రంగా పరిగణి స్తుంన్నా మో !
ఇదే విషయం మీద చాలా మంది రాశారు . కానీ తస్లీమా నస్రీన్ లాగా marketing చెసుకోలేకపోయారు

Post a Comment