మురళీ మోహన్ తెలుగు దేశం ఓటు

నిన్న జూబిలి హిల్స్ పబ్లిక్ స్కూలులో, ఓటు వెయ్యడానికి వచ్చిన సినీ నటుడు మురళీ మోహన్ని పొలింగ్ బూత్‌లోని ఆఫీసర్లు మీ పేరులేదు. మీరు ఓటువెయ్యడానికి లేదు అంటు వెనక్కి తిప్పి పంపేసారు.


ఓటువెయ్యలేక బయటకు వచ్చిన మురళి మోహన్ని, "అయ్యా మీ స్పందన" అని షరా మాములుగా, ప్రసారా మాధ్యమాలు, మైకు పుచ్చుకుని అడిగితే, సదరు నటుడు, ఆ ఏముంది, తెలుగు దేశం పార్టి అభిమానిని కదా, అందుకని, ఈ కాంగిరేసు ప్రభుత్వం, ఓటరు జాబితానుండి, నా పేరు తొలగించింది. గతంలో ఇక్కడే నేను వోటువేసాను. ఇదిగోండి నా వోటరు కార్డు, అంటు తన కార్డుని కూడా చూపించాడు.

ఆయన ఓటు గురించి ఇలా చెప్పింది:
దిన పత్రికలో దానికి జవాబు ఇక్కడ చూడండి.
"మురళీ మోహన్ కుటుంబానికి చెందిన నాలుగు ఓట్లూ కొండాపుర్, ఎం పీ పీ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఉన్నాయి. మురళీ మోహన్, భార్య విజయలక్ష్మి, కొడుకు రామ్మోహన్, కోడలు రూప..నలుగురు ఓట్లు ఉన్నాయి. హౌస్ నెం 1-118/1/జి/303 చిరునామాతో ఉన్నాయి. అయితే, అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లనే మురళీ మోహన్ ఓటు వేయలేకపోయారని స్పష్టమవుతోంది", అని సాక్షి సాక్షం.
ఇక వ్యాపారవేత్త, నటుడు, నిర్మాత, అశోక్ కుమార్, నాలుగు బూతులు తిరిగి, తన పేరు కనపడక ఓటు వెయ్యకుండానే వెళ్ళిపొయ్యాడు.

3 వ్యాఖ్యలు:

కొత్త పాళీ on May 30, 2008 at 9:20 AM   said...

Actually, how does a voter know which polling booth he/she must go to? genuine question...

రాజేంద్ర కుమార్ దేవరపల్లి on June 6, 2008 at 4:28 AM   said...

సినిమా నటుడు మురళీమోహన్ ఓటు లేకపోవటం లేదా మాయం అవటం పట్ల వచ్చిన వార్తలు కాస్త అతిగా ఉన్నాయి.ఓటర్లజాబితాలో యం.రాజబాబు ఆయన అసలు పేరు లేదా యం.మురళీమోహన్ అని ఉంటుంది,అంతే కానీ ఈయన సినిమా నటుడు తెలుగుదేశం కార్యకర్త అని ఉండదు కదా?అలా ఉన్నా ఈయన్ను ఇంకా ఏపేరుతో ఉన్నా గుర్తుపెట్టుకుని మరీ ఓట్లు తొలగించారనుకోవటం చిత్రంగా ఉంది.సాక్షివాడు చూపించాడుగా ఎక్కడున్నదీ వారి ఓట్లు.చాలా మంది రాజకీయనాయకుల కన్నా నిష్టదరిద్రులు,ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్నారు,ఉంటారు. ఆ నికృష్టులవల్ల సగం వ్యవస్థ నాశనం అయ్యింది,చట్తప్రకారం ఓట్లన్నీ నమోదయ్యాయా?అందరికీఓటరు స్లిప్పులందాయా అన్నది ఎన్నికల కమీషన్ పరిధిలోని అంశం.రాష్ట్రప్రభుత్వాలు కేవలం సహకరిస్తాయి.అయినా ఎన్నికలకు కాస్త ముందుగా ఓటరు స్లిప్పులు పంచుతారుగా,అవి తీసుకోలేదా ఆయన?

netizen on June 6, 2008 at 7:03 PM   said...

@కొత్త పాళీ; " Actually, how does a voter know which polling booth he/she must go to? genuine question...
ప్రశ్న కి జవాబు: "As an elector you should immediately check whether your name has
been included in the electoral roll of the constituency where you reside or not.
You can find out this information from the Electoral Registration Officer of your
area. Electoral rolls in all major cities have now been displayed on official websites also."
మరిన్ని వివరాలకు దర్శించండి: http://www.eci.gov.in/ECI_voters_guideline_2006.pdf

Post a Comment