అక్షర ఉద్యమం


కొత్త పాళీ గారు బత్తిబంధ్ కి పిలుపునిస్తూ కొంతమంది బ్లాగర్లను, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) మీద తమ తమ అభిప్రాయాలాను తోటి వారితో పంసుకోమన్నారు. ఆ సందర్భంలో ఒక బ్లాగరి - "భారతానికి కావలసింది దీపాలార్పడం కాదు. దీపాలు వెలిగించడం. both literally and metaphorically. వేల గ్రామాలు ఇంకా విద్యుద్దీపాలు చూడని దేశంలో నిజంగానే దీపాలు కావాలి. ఇరవై నాలుగ్గంటలు నియాన్ లైట్ల క్రింద కూచ్చునే వాడికి ఒక గంట ఆర్పేసు కూచ్చోవటం నావెల్టి. :౦) ఇంత పూనకమొచ్చినట్టు ఏదైనా చెయ్యాలనుకుంటే అక్షరదీపాలు వెలిగించడం గురించి ఎందుకు ఉద్యమించరు?" అంటూ ప్రశ్నించారు.

దానికి ఒక మేరకు కొంత సమాధానం ఇది. పత్రికల ద్వార జరుగుతున్న "అక్షర ఉద్యమం" కి ఒక పార్శ్వం మాత్రమే!
మిగతా పత్రికల ద్వారా " అక్షర ఉద్యమం" జరగడం లేదు, వారు చెయ్యడంలేదు అని ఇక్క డ చెప్పడం ఉద్దేశ్యం కాదు. కేవలం ఈ పత్రికలోని వార్త అందుబాటులో ఉండడంవలన దీనిని మీతో పంచుకోవడం జరుగుతున్నది.

అలాగే ఈ ప్రక్రియే "అక్షర ఉద్యమం" అని నిర్వచించబూనుకోవడంలేదు. ఇలా కూడా చేయవచ్చు, చేస్తున్నారు, ఇలాంటి సత్కార్యాలను, పత్రిక యాజమాన్యాలు ప్రోత్సహిస్తునే ఉంటవి అని చెప్పడమే ఈ టపా ఉద్దేశ్యం.

ఇక "అక్షర ఉద్యమానికి" ఎవరైనా ఒక రూప కల్పన చెసి, ఒక ముసాయిదా ప్రణాలిక తయారు చెయ్యడానికి ముందుకు వస్తే, వారికిదే ఇదే ఆహ్వానం.0 వ్యాఖ్యలు:

Post a Comment