వ్యాఖ్య

ఇటీవల వెలువరించిన టపాకి వచ్చిన ఒకానొక వ్యాఖ్య చాలా తీవ్రమైన మానసిక సంక్షోభానికి, మనస్థాపానికి    గురిచేసింది. అంత దాఋణమైన వ్యాఖ్యలని అహ్వానిస్తుందనుకుంటే, టపా వెలువడేదే కాదు.

ఆ వ్యాఖ్యలు ప్రేరేపించినవి ఈ టపాని:

ఒఖ్ఖ వ్యాఖ్య, అలోచనాఝరి గతినే మార్చివేసింది.

ఆ వ్యాఖ ప్రభావం -

ఈ  బ్లాగరి జీవితకాలం వెన్నంటి, వెంటాడుతునే ఉంటుంది,
కీచురాయి రొదలాగ.
భవిష్యత్తులో ఈ బ్లాగింగులోనే కాదు,
కీ బోర్డు మీద వెలుపెట్టినప్పుడల్లా,
కలాన్ని కాగితానికి తాకించినప్పుడల్లా,
ఆ వ్యాఖ్య మావటివాడి శూలంలా పొడుస్తునే ఉంటుంది. 

భుజంమీద నిలబడి,
కాకిలా చూస్తునే ఉంటుందది,
డేగ కళ్ళతో,
హెచ్చరిస్తుంది అది నక్క ఊళతో!

ప్రాణం పోసుకునే ప్రతి పదాన్నీ,
ఆ జీవుల మూలుగుల మధ్య,
స్వాగతించగలిగినంతటి పంచాణుడు కాదీ బ్లాగరి.

మరొకరిని జీవితాన్ని, జీవన గమాన్నాని ప్రభావితంచేసి, శాసించే అంశాల మీద బ్లాగాలా?
బ్లాగుల నుంచి నిష్క్రమించాలా ?
రాయాలా?
రాయడం మానెయ్యాలా?
*ఆ వ్యాఖ్యని ఆపలేదు.

15 వ్యాఖ్యలు:

MV on October 2, 2008 at 11:13 AM   said...

శూలాలతో పొడిపించుకునేవారికి ఊళలు ఎలా వస్తాయి? కలాన్ని కాగితానికి తగిలించకపోతే సిరా బతుక్కి విలువేది ? జీవితాన్ని, దాని గమనాన్ని శాసించే అంశాలు ఆ జీవాత్మలాంటి పరమాత్మ చూసుకుంటాడు కానీ, బ్లాగటం మానేస్తే నొప్పి పోతుందా, ఊళలు వినపడకుండా ఉంటాయా?

రాధిక on October 2, 2008 at 5:12 PM   said...

ఇది కవిత అయితే చాలా బాగుంది.మీ మనోవేదన అయితే చాలా బాధగా వుంది.

కొత్త పాళీ on October 2, 2008 at 7:48 PM   said...

మీరు కొంచెం లైట్ తీస్కోవాలి. :)
వంశీ .. మంచి ప్రశ్నలు :)

Anonymous on October 2, 2008 at 8:20 PM   said...

ఔను, నిజమే, వంశీ గారు.
వేణు మాస్టారి ఇంటిపేరు తెలిసిందా!

మాగంటి వంశీ మోహన్ on October 2, 2008 at 9:18 PM   said...

లేదండీ, ఆయనదీ మా "బందరే" అయినా, దురదృష్టం కొద్దీ నాకు తెలిసిన వాళ్లెవరికీ ఆయన ఇంటి పేరు తెలియదు. చివరాఖరికి పరుచూరి శ్రీనివాస్ గారికి కూడా తెలియదు అని తెలియవచ్చింది...కాబట్టి, ఇదిగా ఉన్న అది తెలుసుకోవటం కొంచెం కష్టమయిన పని లానే ఉంది ..కానీ వదిలేది లేదు అని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను..తెలిసినప్పుడు తప్పక తెలియచేస్తాను

Rajendra Devarapalli on October 3, 2008 at 1:25 AM   said...

ఖా బాగా వాడారు,వత్తారు గాని,ఆ నేపధ్యమేమిటో కాస్త చెప్తే ఆ ఊళలు,శూలాల సంగతి చూద్దాం.

Kathi Mahesh Kumar on October 3, 2008 at 3:08 AM   said...

కాంటెక్స్ట్ అర్థమైతే కవిత మరింత అర్థవంతంగా ఉండేదేమో!

కామేశ్వరరావు on October 3, 2008 at 3:49 AM   said...

ఇక్కడ నేనోసారి బుజాలుతడుముకుంటున్నాను.
నెటిజన్ గారు, మీరిక్కడ అంటున్నది మీ ముందరి టపాకి నా వ్యాఖ్య గురించా కొంపతీసి?

netizen నెటిజన్ on October 4, 2008 at 1:05 AM   said...

@ రాధిక: మీ కవితలు బాగుంటాయి. ఇది మీకు నచ్చినందుకు సంతోషం.

@ కొత్తపాళీ: లైట్ తీసుకున్నాం సారు. :)
వంశీ గారి ప్రశ్నలు కూడ ఒక కారణం దానికి.

@ రాజేంద్ర కుమార్ దేవరపల్లి: తప్పకుండా, రాజేంద్ర, ఆ ఊళలు, శూలాలు, వాటి సంగతి తేలాల్సిందే. మనం తేల్చాల్సినవే. ఒక చెయ్యి వెయ్యరాదు?!

@ కత్తి మహేష్ కుమార్: సినిమాలు చూసి ప్రజలు చెడిపోతున్నారు. భలేవారే, మీమ్మల్ని చూసే కదా మేము సినిమాలు తీస్తున్నదని వారు. (నిన్న రాము, సూరిని కలిసాడంట, (మరొక "సర్కారు" కోసమేమో), రవి జీవితాన్ని చిత్రీకరించడానికా?).

అలాగే, రచయిత కూడానా? ఉదా: ఒక కొ.కు, ఒక శ్రీ శ్రీ, ఒక గోపిచంద్, ఒక చెలం, ఒక బుచ్చిబాబు, ఒక శారద. లేదు యండమూరి, మల్లాది, సూర్యదేవర, చల్లా, మధుబాబు లాంటి రచయితలు.

అరసం. సరసం. విరసం.

అభ్యుదయ, సృజన, కాగడ, కృష్ణపత్రిక, భారతి, మిసిమి.
ఒక మదన, అభిసారిక, జ్యోతి, యువ, విపుల, చతుర. స్వాతి.

ఒక దివ్వేదుల, ఒక మాలతి చందూర్, ఒక రామలక్ష్మి, ఒక లత, ఒక యద్దనపూడి, ఒక మాదిరెడ్డి. ఒక బొమ్మదేవర.
వీరందరూ చదువరికి కావల్సినవి రాసినవారు. పాఠకులు కూడా మాకివి బాగున్నవి అని అన్నవారే. రచయిత ఒక పాఠకుడిని తన రచనతో ప్రభావితం చెయ్యగలడా? అలాగే ఒక పఠిత ఒక రచయిత్రిని తన వ్యాఖ్యలతో ప్రభావితం చెయ్యగలదా? వారిరువురి మధ్య ఎటువంటి సంబంధబాంధ్యాలుండాలి?

ఈ నేపధ్యంలో ఈ తెలుగు బ్లాగ్‌ప్రపంచంలో బ్లాగరి -పఠితల మధ్య ఎటువంటి సంబంధం అభిలషణీయం?

బ్లాగరి టపా, పఠిత వ్యాఖ్య పరస్పరం ఎటువంటి ప్రభావాలు చూపిస్తే హర్షణీయం?

విడిగా ఒకటి "టపా"యిస్తానంటారా?

(ఇప్పడు చెప్పండి, ఈ నేపధ్యంలో ఈ టపా ఎలాగుంది? :))

@ oremuna; అబ్బే, లేదు, ఆ ఆలోచన అలా అలా తెలిపోయింది. బాల్చి తన్నేదాకా ఆ ప్రసక్తే లేదు. లైట్ తీసుకున్నాం. కూసింత నెమ్మదిగా, అప్పుడప్పుడూ, స్వల్ప విరామాలతో..ద్విగ్వుణీకృత ఉత్సాహంతో..ఏవంటారు? :)

@ భైరవభట్ల కామేశ్వర రావు: "కుదుపు" నుంచి బయటపడ్డారుగా! సంతోషం.

@ teresa: Did you get it now?

netizen నెటిజన్ on October 6, 2008 at 8:48 AM   said...

@Vamsi M Maganti: వంశీ గారు, సంగీత దర్శకుడు వేణు గారి ఇంటి పేరు - మద్దూరి అండి!

మాగంటి వంశీ మోహన్ on October 6, 2008 at 9:16 AM   said...

Oh... thankyou thankyou thankyou...wish you had told me a little earlier.....I would have mentioned that in the two radio programs dedicated to the master, broadcasted last week and prior week...

Anonymous on October 6, 2008 at 10:07 AM   said...

@Vamsi M Maganti: Well, you can still edit and broadcast it else update the relevant literature that went with it.

Post a Comment