చిరుతే యమదొంగా లేదా యమదొంగే చిరుత?

Posted by netizen నెటిజన్ on Thursday, September 27, 2007
అమలాపురంలో రగులుకున్నదట.
విజయవాడకి అంటుకున్నదట.
"వాడీ" డబ్బాని వీళ్ళు తీసుకెళ్ళి కాలవలో పడేసారంట.
వాళ్ళేమో "వీడి" సినిమాకి "ఆ హాళ్ళో" బాన్నర్లు, గట్రా కట్టకూడదని గొడవంట.

ఇంత గొడవజరుగుతున్న ఈ సినిమాలు అంత గొప్పవా?

ఈ సినిమాలు చూడాలంటారా?


ఇది "వాడిది"
ఆ బొడ్డు, దానితో వాడి ఆట, పాట చూడాలా?
ఇదేమో "వీడిది".
ఆ నడుము దానితో వీడి నకరాలు కావాలా?


ఇక దీనికి రాజకీయ కక్ష్యలు ఎంతవరకు ఆజ్యం పోస్తాయొ వేచి చూడాల్సిందే.



సినిమా బాగుందా (జూలై 20న 2007లో) కి అనుబంధంగా ఒక poll కూడా ప్రచురించడం(?) జరిగింది.
ఆ పోల్ల్‌లో ప్రేక్షకుల మీద సినిమాలలొ "కులం" ప్రభావం ఎంత వరకు ఉందో చూద్దామని ఒక చిన్న ప్రయతం చెయ్యడం జరిగింది.

ఆ గణాంకాలు:
ఆ ఫొల్ల్లో పాల్గొన్నవారు ఏడుగురు.
వీరిలో రెండు శాతం మందిమీద సినీ జగత్తులోని వ్యక్తు ల కుల ప్రభావం ఉంది.

నిర్మాత, దర్శకుడు, కధానాయకుడు, నాయిక, సంగీత దర్శకుడు - వీరందరి కులాలు కూడా ఆ pollల్లో పాల్గొన్నవారిని ప్రభావితం చేసినట్టు కనపడుతుంది.

చివరకు ఆ సినిమా సమీక్షకుడు, అది ప్రచురించిన పత్రికాధినేత కులం కుడా దీనికి అతీతం కానట్టుంది.


కొసమేరుపు: కొత్తగా విడుదలవుతున్న నిర్మాతది ఒక కులమైతే, అందులొని కధానాయకుడి కులం మరొకటి. వారిద్దరు బానే ఉంటారు.
మరి మధ్యలో నాశనమైపొయ్యేది ఈ కులాల రణక్షేత్రంలో ఎవరు?

1 వ్యాఖ్య:

శ్రీ on September 27, 2007 at 7:11 AM   said...

కొసమెరుపులో చెప్పినట్టు వాడు,వీడు బాగానే ఉంటారు, మద్యలో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అమాయక ప్రజలు బలవుతూ ఉంటారు! బాలక్రిష్న, చిరంజీవి అభిమానులు ఇంకా కమల్ హాసన్, రజని కాంత్ అభిమానులు కుడా బాగానే గొడవ పడుతూ ఉంటారు.

అభిమానం వెర్రితలలు వేయకముందే మనల్ని మనం ప్రశ్నించగలిగే తెలివితేటలు ఉన్నపుడు ఇటువంటి చిల్లర విషయాలు జరగవు. ప్రజలు ఎదగాలి, చదువుకోవాలి ....దానితో పాటు కొంచెం సంస్కారం అలవరచుకోవాలి.

Post a Comment