(ఇల్లు - ౧) మిమ్మల్ని వంచించాను, క్షమించండి!

ఇల్లు ని చదివిన తరువాత ఇది చదవండి!
మీరందరు నన్ను క్షమించాలి.
ఎందుకో చెబుతున్నాను, చదవండి.మనకి మన మీద ఎంత నమ్మకమ్మన్నది తెలియజేసారు.

మనకి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థాగత నీయమ నిబంధనల మీద ఎంత నమ్మకమున్నదో తెలియజేసారు.

మనకి లంచాలతో పనులు జేసుకోవడంమీదున్న ప్రఘాడమైన విశ్వాసాన్ని కూడ తెలియజేసారు.
ఇలాంటివి జరుగుతునే ఉంటవి.
ఇది మాములే.
ఇవన్ని మామూలే.
మనం కాకపోతే ఇంకొరు జేస్తారు. దానికి లబ్ధిదారులు వారే అవుతారు. దాని బదులు మనమే చేద్దాం. ఆ పొందే లాభం ఏదో మనమే పొందవచ్చు కదా అన్న ఒక దురాశ.

ఆ "అప్రాచ్యుడు" అన్నట్టు, " Rules are made to be broken".
నియంత్రణలున్నది అధిగి మించడానికే కదా?

హద్దులున్నది ఎల్లలని చెరిపివెయ్యడానికే కదా?
(Louis Armstrong పాట "Don't fence me in" గుర్తోస్తుందా?)

ఒకానొక కాలంలో ఒక మాస పత్రిక వచ్చేది.
దాని పేరు "జ్యోతి".
అందులోనే "ఓ పొడుగు కవి" ఒక "పొట్టి కవి" పరస్పరం "దూషించుకునేవారు".
సదరు మాస పత్రికలో ఒక శీర్షిక ఉండింది.
దాని పేరు "నేను ఒక మంచి వెధవని".

  • రైల్వే ప్లాట్‌ఫార్మ్ టికేట్టు కొనకుండా స్టేషన్‌లోకి వెళ్ళడం.
  • హాస్పిటల్ "అనుమతి లేని వేళల్లో" వార్డు బాయికి చిన్నపాటి "టిప్" ఇచ్చి లోపలికి దూసుకెళ్ళడం.
  • అటు, ఇటు చూసి "మామ" లేడని గమనించగానే "ఎర్ర లైటు" వెలిగినా దూసుకుపోవడం.
  • బడ్డి వాడు పొరబాటున చిల్లర ఎక్కువిచ్చినప్పుడు, గమనించినా చూడనట్టు జేబులో వేసుకోవడం.
  • ఆఫీసులో పర్సనల్ కాల్స్‌ని వారి అకవుంటులో చెయ్యడం. వగైరాలు.
ఆ శీర్షికలో అలాంటి కధనాలు, పాఠకుల రాసి పంపినవి, ప్రచురించేవారు.

నిజమే అందరు దొంగలు కాదు. కాకపొతే ఐదు పైసలు తీసినా దొంగే , కోట్లు ఎగగొట్టినా దొంగే.

  • ఎదో హడావిడిలో పొరబాటున అర కిలో బదులు ఒక కిలో తూకం కట్టి, డబ్బులు అర కిలో తీసుకున్నప్పుడు చూసినా లెఖ్ఖసరిజేసి ఇవ్వకపోవడం లాంటివి ఈ "మంచి వెధవ"లు జేసే వారు.

ఇది, ఎదో ఒక సామాజిక వర్గానికో, ఒక మతానికో, ఒక ప్రాతానికో చెందినది కాదు.

అదికూడ మన వ్యక్తిత్వంలో లోపమే. ఎవరినో తిట్టాలిసిన పని లేదు.

"అబద్ధ్హాలు ఆడొద్దు", అని చెబుతాం.
వాడు "అది" కావాలని అడిగినప్పుడు, "డబ్బులు లేవు" అని చెబుతాం.
పర్సు నిండా వాడికి "డబ్బులు" కనబడుతు ఉంటాయి.

పోలీసులు రక్షకులు.
కాని వారే భక్షకులవుతున్నారు.

ఆదాయపు పన్ను కట్టాలి.
కాని దాన్ని ఎలా ఎగ్గోట్టడమా అని "కన్నాలు" వెదుకుతారు.

"నిజం, చెప్పు అని",గద్దిస్తాము.
కాని మనం వాడి ముందు "నిజం" చెప్పం. "అబద్ధం" జెబుతాం.
మనం చెప్పేదొకటి, చేసేదొకటి.

దానివల్ల మన అలోచనా తీరే వికృతంగా మారిపోయింది.
ఏది కూడా తిన్నగా ఆలోచించలేకపోతున్నాము.
ఎందుకంటే తిన్నగా ఆలోచించడానికి శక్తి నిచ్చే ఆ "విలువల" నడుం వంగిపోయినవి.
నిటారుగా నిలబడలేవు.
వాటి అసారాతో నడవవలసిన పిల్లలు, ఈ వంకర విలువలే నిజమైన విలువలుగా జీవనాన్ని సాగించడానికి అలవాటుపడ్డారు.

కొన్నాళ్ళకు "విలువలు" కి కొత్త నిర్వచనాలిచ్చుకోవలసి వస్తుంది.
మన మంచితనం మనల్ని ఎప్పుడు కాపాడుతుంది.
దాని మీద "నమ్మకం" కోల్పోవద్దు.
"మంచి"ని ఎప్పుడైనా నమ్మోచ్చు.

  • ఈ బొమ్మలోని "మేడ", ఓల్డ్ సిటిలోది కాదు.
  • ఈ బొమ్మలోని "మేడ" భాగ్యనగరంలో, కూకట్‌పల్లి లోది కూడా కాదు.
  • ఈ బొమ్మలోని "మేడ" భాగ్యనగరంలోది అంతకంటే కాదు.
ఈ బొమ్మ ఇక్కడిది.

మొన్న Guardian లో - ఫిలిప్ రాసిన వ్యాసం చదవండి.

మంచి వాడు "పాపి" గా ఎలా మారుతున్నడో.

5 వ్యాఖ్యలు:

oremuna on March 8, 2008 at 4:49 AM   said...

ఒక్కళ్ళని ఒక్కసారి మోసం చెయ్యవచ్చు, అందరిని అన్నిసార్లూ మోసం చెయ్యలేరు. సిక్

Anonymous on March 8, 2008 at 9:13 AM   said...

@oremuna: You can fool all the people some of the time, and some of the people all the time, but you cannot fool all the people all the time. - Abraham Lincoln.

చిన్నమయ్య on March 8, 2008 at 11:15 AM   said...

మీ బ్లాగూ మీ ఇష్టం. మళ్లీ ఇంకోటి రాసి, అది ఒప్పూ, ఇది తప్పూ అంటారేమో, ఏం చెప్పగలను? మీ చేంతాడంత సంజాయిషీలో - కప్పిపెట్టబోయి విఫలమైన అపరాధ భావం తొణికిసలాడింది.ఇదేమైనా కొత్త సాహిత్య ప్రక్రియా? నెటిజనులు - "నట" జనులు కాకండి. మన్నించేను.

Anonymous on March 9, 2008 at 7:12 AM   said...

@చిన్నమయ్య:; "మళ్లీ ఇంకోటి రాసి, అది ఒప్పూ,"-మళ్ళీ దీని మీదే ఇంకొక టపా ఎదురుచూడండి!

krish on March 9, 2008 at 11:19 AM   said...

వంచించినంత మాత్రాన మాకు ఎ బొంగు, బోషణం, తొక్క, తోలు ఊడదు... ఇటువంటి టపాల ... మీ విజ్ఞాతకే వదిలేస్తున్నాం ... మరో టపానా... చూద్దాం...

Post a Comment