వీరేనా మనం గౌరవిస్తున్న స్త్రీలూ!

పెద్దలకు మాత్రమే!

ఒక రాజకీయ పక్షానికి చేందిన మహిళా విభాగానికి అధినేత్రి అయ్యినప్పుడు ఆ పదవికి శోభ ని తెచ్చేదిగా ఉండాలి ఆ వ్యక్తి వ్యక్తిత్వం.



 గులాబి లా తన సౌరభాన్ని విరజిమ్మాలి.  దానిని అస్వాదించి పదిమంది అలాంటి ఉద్యమాలకి నేనంటే నేనని పోటిపడాలి.

కాని ఇప్పుడు ఎవరు, ఎవరితో పడుకున్నారో, ఎవరు ఎవరిని పడుకోబేట్టారో, ఎవరు ఎవరిని ఎవరితో ఎలా పడుకోబెట్టారో, ఎవరు ఎవరిని ఎవరితో ఎక్కడ ఎలా పడుకోబెట్టారో, "పడుకున్నప్పుడు  మాసిన బట్ట"  ఇది  అని ప్రజలందరి మధ్య దులుపుతు ..అసలు ఆ జాతి మీదే వెగటు, అసహ్యం, రోత, జుగుప్స కలుగజేస్తున్న వీళ్ళని చూస్తు ఉండాలా?
వీళ్ళనా  ఓటు వేసి గెలిపించి గౌరవించేది?
తెలుగు స్త్రీ ని అవమానించడం కాదా,  వీళ్ళని గెలిపిస్తే!
వీరేనా మనం గౌరవిస్తున్న స్త్రీలూ!
ఛీ, ఛీ!
గతంలో కూడ ఇలాగే! ఇక్కడ చదవండి.

10 వ్యాఖ్యలు:

పద్మనాభం దూర్వాసుల on March 2, 2009 at 10:18 AM   said...

రాజకీయ పార్టీలు తమ మహిళా విభాగాలకు ఇటువంటి వారే తగినవారని అనుకుంటున్నారు,వీళ్ళిద్దరే కాదు.జాతీయ పార్టీ కాంగ్రస్ ఆంధ్ర మహిళా విభాగానికి పెద్ద గంగాభవానీ గారు ఆ మధ్య పేట్రేగిపోయారు కదా. రౌడిజమ్ ఏం మగవారి సొత్తా?

xyz on March 2, 2009 at 4:05 PM   said...

PRP ఎదురు దాడి చేస్తేనే తెలిసిందా మీకు ?

Anonymous on March 2, 2009 at 7:55 PM   said...

తాజాకలం: "ప్రేమే లక్షం - సేవే మార్గం" కదా ప్రజారాజ్యం వారి టాగ్ లైన్ (సినిమా ఫక్కిలో) మరి ఆ శోభారాణి గారు, ట్రక్కుల కొద్ది గులాబిలను రోజా గారికి పంపితే బాగుండేదేమో!

Kathi Mahesh Kumar on March 2, 2009 at 9:23 PM   said...

రాజకీయంలో నెగ్గుకురావాలంటే ఆమాత్రం ఉండాలి. తప్పదు. నాయకుల మీదికి చెప్పులు విసిరితేగానీ "ఫైర్ బ్రాండ్" అని మహిళల్ని నెత్తికెక్కించుకోరు ఈ పార్టీలు.లేకపోతే సినీతారో ,మరో రాజకీయనాయకుని భార్యో అవ్వడం అవసరమైన qualification. We get the politicians we deserve, women are no exception.

Mahesh Telkar on March 2, 2009 at 9:42 PM   said...

మొత్తానికి వీళ్ళంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని తమ పక్కలో పడుకోబెట్టుకుంటున్నారు. నా మాటలు తప్పుగా ఉంటె క్షమించండి .. కాని ఇది నిజం! అయినా అది మనతప్పే ... వీళ్ళంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని .. అంటే మనల్ని చేరచడానికి ప్రయత్నిస్తుంటే మన మౌనానికి మనమే సిగ్గు పడాలి ... so called మహిళా సంఘాలు ఇప్పుడు ఎందుకు మౌనంగ ఉన్నాయో అర్థం కావడం లేదు. సినిమాల్లో స్త్రీని అశ్లీలంగా చూపిస్తే పోటెత్తే ఈ మహిళా సంఘాలు ఈ లీడర్స్ ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఇప్పుడు ఏ చీర కొంగున దాక్కున్నాయో?

వీళ్ళనని ఏమి లాభం లేదు .. సిగ్గులేకుండా మన గౌరవాన్ని వాళ్ళకు సమర్పణ చేసుకున్తున్నమే అదే పెద్ద పాపం... వీళ్ళని తరిమికొట్టడానికి ఉన్న ఏకైక ఆయుధం వోటు !! అవును ఇది చాల పాత మాటే ... కానీ పదునుగా లేని కత్తితో యుద్ధానికి వెళ్తే తప్పక మనం పరాభవం పొందాల్సిందే. .... అలాగే ఆలోచన లేని వోటు కూడా అంతే ... వోటు మనకు నచ్చిన నాయకులను ఎంచుకోవడనికే కాదు ... మనకెవరు వద్దో చెప్పడానికి కూడా పనికొచ్చే ఆయుధం.

ఆలోచించండి ... వోటు ఆయుధాన్ని పదును పెట్టండి ... సరైన నాయకులని ఎన్నుకుందాం!

Praveen Mandangi on March 2, 2009 at 10:08 PM   said...

రోజా ఎన్నికలలో ఓడిపోయి మళ్ళీ సినిమాలలోకి వచ్చి వ్యాంప్ వేషాలు వేస్తుంది అని శోభారాణి అన్నది. చిరంజీవి కూడా వ్యాంపులతో చిందులు వేశాడు అని రోజా అన్నది. ఇద్దరూ గురివింద గింజలే కదా.

Anonymous on March 3, 2009 at 12:07 AM   said...

రాజకీయాలో మరొకటో అని కాదు.... అన్ని రంగాల్లోనూ అసలు మన భాషే మొద్దుబారిపోతున్నది.. ఏం మాట్టాడాలో, ఏది కూడదో పట్టింపు లేనేలేదసలు. అసలు సంయమనం, హుందాతనం అన్నవి కొన్నాళ్లకు దివిటీ పెట్టుకు వెతకాలేమో. అన్నిటికీ మించి భావోద్వేగాల్ని గ్లోరిఫై చేస్తూ శరీర భాషలోకీ, నాటు పదాల్లోకీ అనువదించడం కొంత సినిమాల ప్రభావం, మరికొంత తమంతతాముగా సున్నితత్వాన్ని కోల్పోవడం.

శ్రీనివాస్ on March 3, 2009 at 3:40 AM   said...

ఏ పార్టి ఐన కాదేది బూతుకనర్హం ....

రాత్రి టి.వి. నైన్ లో ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య శోభా రాణి గారిని ప్రశ్నించినప్పుడు .. శోభా రాణి ఎదురు దాడి చేసారు . సంధ్య గారిది అగ్రకుల పెత్తనం అన్నారు .. దళితులు ప్రశ్నిస్తే సమాదానం చెప్తా అన్నారు

ప్రజా రాజ్యం లో ఒక పోసాని ఒక శోభా రాణి వికలాంగులను కించ పరిచిన ఒక ప్రభాకర్ చాలు ఆ పార్టి స్థాయి తెలియచెయ్యడానికి

ఇక తెలుగుదేశం రోజా ని కంట్రోల్ లో పెట్టె దశ ఆ పార్టీ ఏనాడో దాటి పోయింది ..

కాంగ్రెస్స్ మహిళలు ఈమద్య నోరు విప్పడం లెదేంటో

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం on March 4, 2009 at 7:15 AM   said...

Women don't make a homogenous community though some feminists pretend that they are or some women illusorily wish they were. Why we are forced to look at their sex each time a woman comes into focus - I don't know. Why it is so much emphasized upon - I am clueless. Also why we attribute the good and bad of one woman to all women in the world as if all women constitute a faceless, unvarying, interchangeable single entity like baffaloes - I don't get it. Is there nothing special about them except that they are females ? Even those who deem themselves to be thorough-going progressives are found to be indulging in this.

Ram Naveen on March 20, 2009 at 1:16 AM   said...

prasthutha paristhithini choostunte mana samajamlo nythika viluvalu leni varinikuda manam ishtapaduthamu mariyu gelipistunnamu.veellu inka mana samajanni marchestharata? lokam choostundhi....tagina samadhanam chebutharu.

Post a Comment